మహబూబాబాద్: విద్యుదాఘాతంతో మూగజీవాలు మృతి చెందిన ఘటన సోమవారం సీరోలు మండలం తాళ్లసంకీస శివారు పొలాల్లో చోటుచేసుకుంది. గ్రామ శివారు పొలాల్లో విద్యుదాఘాతంతో ఐదు ఆవులు, ఒక ఎద్దు మృతి చెందాయి. దీంతో కురవి – ఖమ్మం ప్రధాన రహదారిపై బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని నిరసన చేశారు. నిరసనకారులతో ఎస్సై నగేష్ మాట్లాడి వారిని శాంతింపజేశారు.