Author: Shivaganesh

  • ఆలనా పాలనా కేంద్రాలుగా అంగన్‌వాడీలు

    నిర్మల్: లోకేశ్వరం మండలం రాజుర పొట్పల్లి ఏడ్డూర్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి చెందిన చిన్నారులకు సోమవారం శివాలయంలో సామూహిక అక్షరాభ్యాసాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NHRC జిల్లా కన్వీనర్ సరస్వతి పాల్గొనారు. ఈసందర్భంగా ఆమె చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలు ఆలనా – పాలనా కేంద్రాలుగా పేరుగాంచాయని అన్నారు. కార్యక్రమంలో పిల్లలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • బాసర గోదావరి నదిలో బోట్లు నిషేధం

    నిర్మల్: బాసర గోదావరి నదిలో సోమవారం నుంచి టూరిస్ట్ బోట్లను నిషేధిస్తున్నట్లు భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి తెలిపారు. నదిలోకి భక్తులను పడవల్లో తీసుకెళ్లవద్దని, నిబంధనలను బోట్ల నిర్వాహకులు పాటించాలని ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నదిలో పడవల ప్రయాణం నిషేధమన్నారు.

  • అమ్మమాట అంగన్‌వాడీ బాట

    ఆదిలాబాద్: బింపూర్ మండలం పిప్పలకోటి అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం అమ్మమాట అంగన్‌వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా అంగన్‌వాడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ, సూపర్వైజర్ రాధా హాజరయ్యారు. ఈసందర్భంగా వారు పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

  • బస్సు ఆటో ఢీ.. మహిళ మృతి

    మహబూబాబాద్: ఆర్టీసీ బస్సును ఓ ఆటో ఢీకొన్న ఘటనలో మహిళ మృతి చెందిన ఘటన సోమవారం మహబూబాబాద్ -కురవి నేషనల్ హైవేపై చోటుచేసుకుంది. బేథోల్ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సును, ఆటో ఢీకొనింది. ప్రమాదంలో బయ్యారం మండలం బొడ్డే తండాకు చెందిన అమల(25) అనే మహిళ మృతి చెందారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • పోలీసులు గిరిజనులకు మధ్య వాగ్వాదం

    ములుగు: పోలీసులు, గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న ఘటన సోమవారం ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామ పంచాయతీ శివారులో చోటుచేసుకుంది. చల్పాకకు వెళ్లే దారిలోని అటవీ ప్రాంతంలో గిరిజనులు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. సోమవారం అటవీ అధికారులు సంబంధిత గుడిసెలను తొలగించేందుకు పోలీసులతో కలిసి వచ్చారు. దీంతో గిరిజనులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. చేసేదేమీ లేక అధికారులు వెనుతిరిగారు.

     

  • ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

    నిర్మల్: బాసరలోని మైలాపూర్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లకు సోమవారం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మమ్మాయి రమేష్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారంలోపే బేస్ మెంట్ లెవెల్ డబ్బులు పడతాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తుందన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

  • బాధిత కుటుంబానికి స్నేహితుల బాసట

    మహబూబాబాద్: గూడూరు మండల కేంద్రానికి చెందిన ఏదుల ఆదినారాయణ ఇటీవల మృతి చెందారు. సోమవారం వారి ఇంటికి ఆదినారాయణ ssc స్నేహితులు వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి రూ. 50 వేలు ఆర్థిక సాయంగా అందజేశారు. కార్యక్రమంలో మిత్రులు నాగమల్లేశ్వరరావు, పాపయ్య, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

  • భూభారతి అవగాహన సదస్సు

    ఆదిలాబాద్: తలమడుగు మండలంలోని ఖోడత్‌లో సోమవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ముఖ్యఅతిథిగా డిప్యూటీ ఎమ్మార్వో ప్రభాకర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. రైతుల నుంచి 36 వినతి పత్రాలను స్వీకరించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

  • ‘భూభారతితో సమస్యల పరిష్కారం’

    ఆదిలాబాద్: తాంసి మండలంలోని వడ్డాడిలో సోమవారం భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తహసీల్దార్ లక్ష్మి పాల్గొని మాట్లాడుతూ.. భూభారతి చట్టంతో రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. అనంతరం పలువురు రైతుల నుంచి భూసమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో గణేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

  • ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

    మంచిర్యాల: జన్నారం మండల కేంద్రంలో సోమవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జన్మదిన వేడుకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్ఆర్ఎస్ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.