Author: Shivaganesh

  • ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేత

    మహబూబాబాద్: గూడూరు మండల కేంద్రంలో సోమవారం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మురళి నాయక్ పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఇండ్లు నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా అధికారులు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

  • ఫోన్లు అందజేసిన పోలీసులు

    వరంగల్: నెక్కొండ పోలీసు స్టేషన్‌లో ఆదివారం సీఈఐఆర్‌(CEIR )పోర్టల్ ద్వారా ట్రేస్ చేసిన సుమారు రూ. లక్ష విలువైన ఐదు మొబైల్ ఫోన్లను బాధితులకు అందించారు. ఎస్‌ఐ మహేందర్ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లు పోగొట్టుకన్నవారికి సీఈఐఆర్ ద్వారా తిరిగి ఫోన్‌లను అందజేసినట్లు తెలిపారు. ఎవరైనా ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.

  • లారీ ఢీకొని ఒకరి మృతి

    సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. బీరంగూడ మల్లికార్జుననగర్ కాలనీకి చెందిన కలిందింది తరుణ్ (28) స్కూటీపై కొల్లూరుకు వెళ్తున్న క్రమంలో బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం రోడ్డు పద్మశాలి‌ భవన్ వద్ద వెనుక నుంచి టిప్పర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • ‘పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి’

    ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సాత్నాల, జైనథ్, బోరజ్, బేలా మండలాల పార్టీ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి జోగు రామన్న సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డిపై కేసులు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ త్వరలో పోలీస్‌స్టేషన్ల ముట్టడికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

     

  • గుళ్లకోటలో వైభవంగా పెద్దమ్మతల్లి బోనాలు

    జగిత్యాల:ఎండపల్లి మండలం గుళ్లకోట గ్రామంలో ఆదివారం సాయంత్రం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పులతో ఊరేగింపు మహిళలు నెత్తిన బోనాలతో అమ్మవారి గుడికి వెళ్లి నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించారు. పెద్దమ్మ తల్లి బోనాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

     

  • కొండాపూర్‌లో గ్రామస్థుల ఆందోళన

    మంచిర్యాల: దండేపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామస్థులు ఆదివారం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన తండ్రి, కుమారుడు భారతారపు లింగయ్య, కుమారస్వామి జీపీ మల్టిపర్పస్ వర్కర్ ప్రభాకర్‌‌పై దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ రమణమూర్తి హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.

     

  • ‘వాస్తవ లాభాలను ప్రకటించి వాటాలు ఇవ్వాలి’

    మంచిర్యాల: నస్పూర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం శ్రీరాంపూర్ ఏరియా టీబీజీకేఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, లాభాల్లో 30 శాతం వాటాను కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.

     

  • ‘లోక్ అదాలత్‌లో 13,048 కేసులు పరిష్కారం’

    పెద్దపల్లి: జిల్లా సీపీ కార్యాయలంలో ఆదివారం సీపీ అంబర్ కిషోర్ ఝా మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఈనెల 14న జాతీయ మెగా లోక్ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 13,048 కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు.సైబర్ నేరాల్లో బాధితులకు రూ.17,66,294 తిరిగి అందజేసినట్లు వెల్లడించారు. కేసుల పరిష్కారానికి కృషి చేసిన అధికారులు, కోర్టుసిబ్బందిని అభినందించారు.

     

  • వృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు

    పెద్దపల్లి: అడ్డగుంటపల్లి‌కు చెందిన డాక్టర్ సాహితీ ముస్త్యాల ఆధ్వర్యంలో ఆదివారం ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో 32 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. ఈసందర్భంగా డాక్టర్ సాహితీ మాట్లాడుతూ.. వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు అందజేసినట్లు తెలిపారు. ప్రతినెల మూడో ఆదివారం వైద్య సేవలందిస్తున్న డాక్టర్ సాహితీని వృద్ధాశ్రమం నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో వృద్ధులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • పేద విద్యార్థులకు ప్రోత్సాహం

    పెద్దపల్లి: మేదరబస్తీ రోడ్‌లోని ప్రాఫిట్ షూ షాపు నిర్వాహకులు ఆదివారం టెన్త్ క్లాసులో ప్రతిభ చాటిన పేద విద్యార్థులకు ప్రోత్సాహకంగా బహుమతులు అందించారు. విద్యార్థులు లలిత (531), నవ్య (508) పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపారు. వారికి బ్యాగ్, పుస్తకాలు, షూ లు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో మహంకాళి స్వామి, గట్ల రమేష్, శ్రీనివాస్, మేనేజర్ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.