పెద్దపల్లి: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం ఉపరితల జలాశయాల శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీఈఈ జమీల్ పాల్గొని భీమునిపట్నం జలాశయం, పరిసరాలను శుభ్రపరిచారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిగిలిన జలాశయాలను కూడా త్వరలో శుభ్రపరిచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు అధికారులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
ట్రాక్టర్ బోల్తాపడి బాలుడి మృతి
మెదక్: ట్రాక్టర్ బోల్తాపడి ఒక బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. నారాయణపూర్ గ్రామానికి చెందిన వినయ్ అనే (15) బాలుడు తమ బంధువులతో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. ఈక్రమంలో బాలుడు ట్రాక్టర్ నడుపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు అది బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
-
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
సంగారెడ్డి: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన ఏడుగురు బాధితులకు ఆదివారం సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.2,98,500 మంజూరయ్యాయి. బాధిత కుటుంబాలకు ఎల్ఓసీ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు సీఎం సహాయనిధి గొప్ప వరం అని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
-
ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష
సంగారెడ్డి: దత్తగిరి మహారాజ్ వైదిక పాఠశాల 2025 సంవత్సరానికి మొదటి విడతగా ప్రవేశ పరీక్షలు ఆదివారం నిర్వహించారు. పరీక్షకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ప్రాంతాలకు చెందిన సుమారు 96 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారికి ఆశ్రమ పీఠాధిపతి, అర్చకులు, ఉపాధ్యాయులు మౌఖిక పరీక్ష నిర్వహించారు. రెండవ విడత పరీక్ష ఉంటుందని త్వరలోనే తేదీని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తెలియజేస్తామన్నారు.
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గరికి తీవ్రగాయాలు
మహబూబాబాద్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన ఆదివారం గూడూరు నుంచి మహబూబాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. దామరవంచ అడ్డరోడ్ వద్ద ఓబైక్ ఆటోను ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
‘నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’
హన్మకొండ: హన్మకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఆధ్వర్యంలో ఆదివారం బస్‌స్టాండ్ పరిధిలో పనిచేస్తున్న టీ స్టాల్స్, పాన్ షాపులు, లాడ్జ్‌ల యజమానులు, వర్కర్లకు పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. రాత్రి 10:30 తర్వాత షాపులు తెరిచి ఉంచకూదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కౌన్సిలింగ్‌లో పోలీసు సిబ్బంది, షాపుల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
-
‘అనుమతులు రద్దు చేయాలి’
ములుగు: పీసా చట్టాన్ని ఉల్లసిగించిన సీతరాంపురం ఇసుక రీచ్ అనుమతులు రద్దు చేయాలని ఆదివారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షుడు తుర్వ కృష్ణబాబు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఆలుబాక (2) హెబిటేషన్ పరిధిలో ఉందని, పీసా చట్టం నిబంధనలు ఉల్లంగించారని అన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
-
రూ.29 వేల ఆర్థిక సాయం అందజేత
జయశంకర్ భూపాలపల్లి: మొగుళ్లపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన అచ్చ అనిల్ తండ్రి సాంబయ్య ఇటీవల మరణించారు. ఆదివారం వారి ఇంటికి అనిల్ బాల్య స్నేహితులు వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి, రూ. 29 వేలు ఆర్థిక సాయంగా అందజేశారు. కార్యక్రమంలో రవితేజ, రాజు, కిరణ్, స్నేహితులు పాల్గొన్నారు.
-
‘లైసెన్స్‌తోనే మెడికల్ షాపులు’
మహబూబాబాద్: మరిపెడ బంగ్లా పరిధిలోని ఔషధ దుకాణాలన్ని నిబంధనలకు లోబడే నడుస్తున్నాయని మరిపెడ మెడికల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఆదివారం స్థానిక రామాలయం ఆలయంలో అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. మరిపెడలో లైసెన్సు లేని దుకాణాలు లేవని, ప్రతి షాపు కూడా అర్హత కలిగిన ఫార్మసిస్ట్, భాగస్వామి-యజమాని పర్యవేక్షణలో కొనసాగుతోందని వెల్లడించారు.
-
పట్టాలు అందజేసిన మంత్రి
మంచిర్యాల: మందమర్రి మండలం సండ్రన్‌పల్లి గ్రామంలోని కెఆర్ గార్డెన్స్‌లో ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. చెన్నూర్ నియోజకవర్గంలోని సోమనపల్లిలో రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, తదితరులు పాల్గొన్నారు.