జనగామ: పాలకుర్తి మండలం శాతాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దర్గాని శ్రీను అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందారు. ఆదివారం శ్రీ సోమేశ్వర ఆటో యూనియన్ నాయకులు శ్రీను ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
వరంగల్: సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన రాగిరి రాజేందర్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆదివారం వారి ఇంటికి మృతుడి SSC 2005 బ్యాచ్ మిత్రులు వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి రూ.17 వేలు ఆర్థిక సాయంగా అందజేశారు. కార్యక్రమంలో కక్కేర్ల సతీష్, ఆగపాటి రామకృష్ణ, చిర్ర నరేష్, రాజ్ కుమార్, రాజేందర్ మిత్రులు పాల్గొన్నారు.
-
‘అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు’
ములుగు: తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంలో ఆదివారం ములుగు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి బడే నాగజ్యోతి పర్యటించారు. ఈసందర్భంగా ఆమె స్థానికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల ఇండ్లను పూర్తిగా అనర్హులకే కేటాయించారని మండిపడ్డారు. అసలైన లబ్ధిదారులను జాబితాలో చేర్చకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకే కేటాయించారని విమర్శించారు.
-
జీవోను రద్దు చేయాలి: ఎమ్మెల్యే పాల్వాయి
కుమ్రం భీమ్: కాజగ్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వు జీవోను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి డిమాండ్ చేశారు. ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకువచ్చిందని అన్నారు.
-
చెరువులో పడి ఒకరి మృతి
నిర్మల్: చెరువులో పడి ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం మైలాపూర్‌లో వెలుగుచూసింది. బాసర గ్రామానికి చెందిన బలగం.రాజు అనే వ్యక్తి (38) ప్రమాదవషాత్తు మైలాపూర్ గ్రామంలోని చెరువులోపడి మృతి చెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గజ ఈతగాల్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
-
‘వినతి అందించిన స్పందించలేదు’
నిర్మల్: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు గోదావరి నది 1వ ఘాటు నుంచి 2 వ ఘాట్ వరకు సరైన భద్రత లేదని గతంలోని స్థానికులు అధికారులకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఆదివారం పలువురు స్థానికులు మాట్లాడుతూ.. గతంలో అందజేసిన వినతిపై స్పందిస్తే ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయే వారు కాదన్నారు. అధికారులు జాత్రగ్తలు తీసుకోవడంలో విఫలమయ్యారన్నారు.
-
‘ధర్నాను జయపద్రం చేయాలి’
ఆదిలాబాద్: ఇచ్చోడ మండల కేంద్రంలో ఆదివారం ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి కల్లేపల్లి గంగయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17న లేబర్ ఆఫీస్ కమిషనర్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికుల ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ధర్నాలో పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
-
జన్నారం ఎస్సై అనూషను సన్మానించిన నాయకులు
మంచిర్యాల: జన్నారం పట్టణ ఎస్సై గొల్లపల్లి అనూషను ఆదివారం తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి (TGWWC) నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు ఆమెను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శాంతిభద్రతలు, మహిళా భద్రత, సామాజిక న్యాయ పరిరక్షణకు ఆమె చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమయ్య, నాయకులు పాల్గొన్నారు.
-
‘కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’
మహబూబాబాద్: గూడూరు, భూపతిపేట, బొద్దుగొండ రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్‌లను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి దృశ్యరూపకంగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ ఆదివారం తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
-
‘కల్తీ ఆహారంపై అవగాహన పెంపొందించాలి’
ఆదిలాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెండవ రోజు జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్తీ ఆహారంపై అవగాహన పెంపొందించాలని, ఆదివాసీల ఆరోగ్యకరమైన జీవనశైలిని ఉదాహరణగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.