Author: Shivaganesh

  • బూర్గంపాడులో ఎమ్మెల్యే పాయం పర్యటన

    భద్రాద్రి కొత్తగూడెం: బూర్గంపాడు మండలంలో మంగళవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు. ఉప్పుసాక, పినపాక, అంజినాపురం, మొరంపల్లి బంజారా గ్రామాల్లో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పర్యాటనలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

  • పనులను పరిశీలించిన అధికారులు

    భద్రాద్రి కొత్తగూడెం: చండ్రుగుండా మండలం బెండలపాడుకు వెళ్లే దారిలో జరుగుతున్న డ్రైనేజ్ పనులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

  • అత్యాచారం నిందితుడు అరెస్ట్..

    ఆదిలాబాద్: ఈనెల 8న శివాజీ చౌక్ సమీపంలో యాచకురాలిపై అత్యాచారం పాల్పడిన నిందితుడు మాడవి నగేష్‌ను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా సీఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఎలాంటి ఆధారాలు లేకున్నా పది రోజుల్లోనే కేసును ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో, కామంతో నేరానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా సీఐని, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

  • ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించిన కమిషనర్

    వరంగల్: బల్దియా సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 81 ఫిర్యాదులు అందాయి. గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ప్రజలు కమిషనర్ చాహత్ బాజ్పాయికి తెలిపారు. తాజాగా కాలనీల్లో రోడ్లు, లేఅవుట్ స్థలాల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులన్ని పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

  • ‘ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలి’

    మెదక్: వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ నారాయణ నాయక్ సూచించారు. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు సెల్ ఫోన్‌లు వాడటం మానుకోవాలని, ఇంటికి ఎర్తింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దని, వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

  • ‘గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి’

    భద్రాద్రి కొత్తగూడెం: వినాయక చవితిని పురస్కరించుకుని గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని అశ్వారావుపేట ఎస్ఐ యాయతి రాజు తెలిపారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు ఈ సూచనలు చేసినట్లు తెలిపారు. https://policeportal.tspolice.gov.in/index.html వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని, మండపం వద్ద 24 గంటలు వాలంటీర్ ఉండేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు.

  • అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డా క్షేమం

    మంచిర్యాల: ఓగర్భిణీ 108 అంబులెన్స్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన సోమవారం భీమారం మండలం ఆరేపల్లి గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన  గర్భిణీ జాడి పుష్పలతకు పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త సాయి 108కి ఫోన్ చేశారు. 108 సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవం జరిగింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని, ప్రస్తుతం వారు చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నట్లు ఈఎంటి షాహబాజ్ తెలిపారు.

     

  • ‘ప్రజలకు కీలక విజ్ఞప్తి’

    మెదక్: జిల్లాలో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి, వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలను కోరారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులను సంప్రదించాలని అన్నారు.

  • ‘ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి’

    మెదక్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ సెరి సుభాష్ రెడ్డి సూచించారు.  వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే అధికారులను సంప్రదించాలని, ప్రజలకు సహాయం చేయడానికి బీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

  • పేకాట ఆడుతున్న నలుగురిపై కేసు..

    ఆదిలాబాద్: జైనథ్ మండలంలోని గిమ్మ శివారులో పేకాట ఆడుతున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు జైనథ్ ఎస్సై గౌతం పవార్ తెలిపారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా, మండ అడెల్లు, మాదస్తు పవన్, మునిగెల భూమన్న, గడసందుల భూమయ్య పేకాట ఆడుతూ పట్టుబడినట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.