మహబూబాబాద్: గూడూరు మండలం కేంద్రంలో ఆదివారం గొర్రె మేకల పెంపకందారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లము అశోక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 22న జిల్లా కేంద్రంలో జరిగే గొల్ల కురుమల మూడవ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జీఎంపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షుడు పోతరాజు రవిను ఎన్నుకున్నారు.
Author: Shivaganesh
-
దుబ్బతండాలో తండ్రి తనయుల విగ్రహావిష్కరణ
మహబూబాబాద్: డోర్నకల్ మండలం బూరుగుపాడు దుబ్బ తండాకు చెందిన తండ్రి తనయులు ఇటీవల ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం వారి స్వగ్రామంలో తండ్రి తనయులు బాలునాయక్, సాయిల విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన వారి విగ్రహాలను ఆవిష్కరించి నివాళులు అర్పించారు.
-
ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఆదిలాబాద్: బేల మండలం సొన్కాస్‌లో పిడుగుపాటు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదివారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎస్సై నాగనాథ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిడుగులు పడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో స్థానిక పీహెచ్‌సీ వైద్యుడు అఖిల్, జన విజ్ఞాన వేదిక జిల్లా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
-
మహబూబాబాద్‌లో చక్రి జయంతి వేడుకలు
మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో సుశ్రుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన చక్రి చిత్రపటం నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చక్రి కంబాలపల్లి గ్రామంలో అనేక సంగీత కార్యక్రమాలను నిర్వహించి యువతకు స్ఫూర్తిని నింపారన్నారు.
-
భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
వరంగల్: నల్లబెల్లి మండలం నారక్కపేట, నల్లబెల్లి, రాంపూర్, మేడిపల్లి గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పర్యటించారు. ఈసందర్భంగా ఆయన ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం పలువురి లబ్ధిదారుల ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గులు పోశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కల సహకారమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు.
-
రక్తదాత నవీన్‌కు సన్మానం
యాదాద్రి భువనగిరి: మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ ద్వారా గత ఆరు ఏళ్లకుపైగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్న నవీన్‌ను శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌లో సన్మానించారు. ఈసందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ.. నవీన్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ దివ్య ప్రపుల్ల, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ స్వాతి, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-
‘రాజీ మార్గమే రాజ మార్గం’
హన్మకొండ: పరకాల పట్టణంలోని కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్జి సీహెచ్ శ్రావణ స్వాతి పాల్గొని మాట్లాడుతూ.. రాజీ మార్గమే రాజ మార్గమని, జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్‌లో ఉన్న పలు కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. రాజీ మార్గంతో ఇరు వర్గాలకు సత్వరన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
-
‘బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదు’
ములుగు: వెంకటాపురం మండలం బోదాపురం పంచాయితీ పరిధిలోని రామన్నగూడెం ఇసుక రీచ్‌ను శనివారం బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తడికల శివ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అలుబాక గ్రామానికి చెందిన బోల్లే సతీష్ అనే వ్యక్తి వద్ద స్టాక్ యార్డు తీసుకున్న వారు డబ్బులు అడిగితే అధికార పార్టీ నాయకులు పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. అతనికి న్యాయం చేయాలన్నారు.
-
మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు
నల్గొండ: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను పోలీసులు కాపాడిన ఘటన శనివారం నాగార్జునసాగర్‌లో వెలుగుచూసింది. హైదరాబాద్ KPHBకి చెందిన జస్విత(28) వరకట్న వేధింపులు తాళలేక తన కారులో ఒంటరిగా నాగార్జునసాగర్‌కు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చివరి నిమిషంలో తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో, వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విజయపురి పోలీసులు ఆమెను గుర్తించి, ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
-
‘రక్తదాతలు దేవుడితో సమానం’
యాదాద్రి భువనగిరి: చౌటుప్పల్ కేంద్రంలోని శనివారం సహస్ర ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో రక్తం అవసరం చాలా ఉందని, యువత రక్తదానంలో పాల్గొని ఆపదలో ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. రక్తదాతలు దేవుడితో సమానమని అన్నారు.