కొమురం భీమ్: కాగజ్‌నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్స్‌లో శనివారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా మహాసభలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. జర్నలిస్టుల రైల్వే పాసుల విషయంలో కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడుతాన్నారు. సమావేశంలో ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
టీడబ్ల్యూజెఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
కొమురం భీమ్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(టీడబ్ల్యూజెఎఫ్) నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక శనివారం కాగజ్‌నగర్ పట్టణంలో పటేల్ గార్డెన్స్‌లో జరిగింది. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి బసవపున్నయ్య, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. సంఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా తాళ్ళపెల్లి.సురేందర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పర్వతి రాజశేకర్ కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.
-
కాగజ్‌నగర్‌లో కుండపోత వర్షం
కొమరం భీమ్: కాగజ్‌నగర్‌లోని పరిసర ప్రాంతాలలో శనివారం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు చిన్నపాటి చెరువులుగా మారాయి. పలుచోట్ల నాలాల్లో చెత్తను తొలగించకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది. వర్షాకాలం నేపథ్యంలో నాళాలు, మురికి కాల్వలు శుభ్రం చేయాలని పట్టణవాసులు విజ్ఞప్తి చేశారు.
-
నీట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మెరిసిన రుచిత
ఆదిలాబాద్: నీట్ పరీక్ష ఫలితాల్లో తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామవాసి రాష్ట్ర స్థాయిలో ప్రతిభకనబరిచారు. గ్రామానికి చెందిన సళ్ళ గవరమ్మ – సంతోష్ దంపతుల కుమార్తె రుచిత ఇటీవల విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో మెరిశారు. ఈసందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.
-
ఝరి గ్రామంలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం
ఆదిలాబాద్: తలమడుగు మండలం ఝరి గ్రామంలో శనివారం రాత్రి పోలీసులు మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ ఫణిధర్ పాల్గొని మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
-
దౌర్జన్యం కేసులో ఇద్దరి రిమాండ్
ఆదిలాబాద్: దౌర్జన్యం కేసులో ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు శనివారం ఇచ్చోడ సీఐ బి.రాజు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చోడ మండల కేంద్రంలో రూ. 5 లక్షల అప్పు విషయంలో జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఇచ్చిన ష్యూరిటీ చెక్కును తిరిగి ఇవ్వకుండా దౌర్జన్యానికి పాల్పడిన పంపట్టే రమేష్, పంపట్టే శుభాష్‌లను బాధితుడి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
-
మంత్రి వివేక్‌కు ఘన స్వాగతం
మంచిర్యాల: చెన్నూరు నియోజకవర్గంలో శనివారం మంత్రి వివేక్ వెంకటస్వామి విస్తృతంగా పర్యటించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి ఘన స్వాగతం పలికి, సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హేమంత్ రెడ్డి దంపతులు ఆయనకు వెండి కిరీటం పెట్టి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
.
-
అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష
జగిత్యాల: ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ పనులు వేగంగా పూర్తిచేయాలని, తాగు – సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
నివాళులు అర్పించిన నాయకులు
యాదాద్రి భువనగిరి: మోత్కూరు మండల కేంద్రంలోని శ్రీకాంత్ చౌరస్తాలో శనివారం బీసీ రిజర్వేషన్ సాధన సమితి (బి.ఆర్. ఎస్.ఎస్.) మండల కమిటీ సభ్యులు ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. అనంతరం ప్లకార్డులు ప్రదర్శించి, కొవ్వొత్తులతో నివాళులర్పించారు. కార్యక్రమంలో నర్సయ్య, శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
-
ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్
యాదాద్రి భువనగిరి: మోత్కూరు పురపాలక సంఘ పరిధిలోని 6వ వార్డులో శనివారం తడిపొడి చెత్తను వేరు చేసి సేకరించటానికి పురసిబ్బందికి, పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిపొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.