Author: Shivaganesh

  • కామ్రేడ్ గోపి స్మారకార్థం విజ్ఞాన కేంద్రం

    యాదాద్రి భువనగిరి: చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లా కార్మిక నాయకుడు కామ్రేడ్ గోపి స్మారకార్థం భువనగిరిలో ప్రజా గ్రంథాలయం, ఆడిటోరియం నిర్మించడానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. వాటి నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు అందించాలని కోరుతూ కరపత్రాన్ని విడుదల చేశారు.

  • నీట్ పరీక్షలో మెరిసిన జిల్లా వాసి

    మహబూబాబాద్: నీట్ పరీక్షలో జిల్లా కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి ప్రణీతం సుహాస్‌కు ఉత్తమ పత్రిభ కనబరిచారు. విద్యార్థికి పరీక్షలో 408 మార్కులు వచ్చాయి. శనివారం విద్యార్థిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, మా అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డపల్లి ఉపేంద్రంలు అభినందించారు. వారు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మంచిగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.

  • ‘తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి’

    ములుగు: ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై కొప్పుల తిరుపతిరావు శనివారం తెలిపారు. ఈనెల 15 వ తేదీ నుంచి వెంకటాపురం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు కచ్చితంగా హెల్మెట్ ధరించే వాహనం నడపాలని అన్నారు. వాహన దారులు తప్పని సరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, ఇన్సూరెన్స్ పేపర్లు కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు.

  • ‘కల్తీని అరికట్టడానికి కేంద్రం కమిషన్ వేయాలి’

    ఆదిలాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో శనివారం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ సోయం బాపూరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్తీ వస్తువులు, నకిలీ మందులు, అధిక ధరలకు ఆన్‌లైన్ విక్రయాలపై ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీని అరికట్టడానికి కేంద్రం కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు.

  • చెన్నూర్‌లో జాతీయ లోక్ అదాలత్

    మంచిర్యాల: చెన్నూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పర్వతపు రవి ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం కేసులు 1458 కేసులు రాజీ ద్వారా పరిష్కారం అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసు అధికారులు,  బ్యాంక్ మేనేజర్స్, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • ఈనెల 19న బాసరకు రానున్న కల్వకుంట్ల కవిత

    నిర్మల్: ఈనెల 19న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వస్తున్నట్లు శనివారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోర్వ శ్యామ్ తెలిపారు. ఉదయం అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశం ఉంటుందని తెలిపారు. పర్యటనలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

  • విద్యుదాఘాతంతో  లైన్‌మెన్ మృతి

    మహబూబాబాద్: విద్యుదాఘాతంతో లైన్‌మెన్ మృతి చెందిన ఘటన శనివారం డోర్నకల్ మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. నర్సింహులపేట మండలానికి చెందిన క్రాంతికుమార్ డోర్నకల్ మండలంలో లైన్‌మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా శనివారం విద్యుత్తు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.

  • ‘బాధిత కుటుంబానికి అండగా ఉంటాం’

    మహబూబాబాద్: మంచి నాయకుడిని కోల్పోవడం పార్టీకి తీరనిలోటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం ఆయన కురవి మండలం రాజోలు గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • రక్తదాన శిబిరం

    ములుగు: వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్అండి అతిధిగృహం ఆవరణంలో శనివారం చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడెం సాయిప్రకాష్ జ్ఞాపాకార్ధం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని వెంకటాపురం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఎమ్మర్వో వేణుగోపాల్ ప్రారంభించారు. కార్యక్రమంలో వాసు, సాయితేజా, సాని, మధు, మురళి, చిడెం శివ యాలం సాయి, మాధూరి తదితరులు పాల్గొన్నారు.

  • ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

    మహబూబాబాద్: నర్సింహులపేట మండలం గోప తండా గ్రామంలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రునాయక్ పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి, పలువురి ఇండ్లకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో పలువురు స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.