Author: Shivaganesh

  • ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

    నిర్మల్: జిల్లా ప్రజలు జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకొని న్యాయ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె, జ్యూడిషియల్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ… న్యాయం కోసం కోర్టుల వద్ద వేచి చూసే అవసరం లేకుండా లోక్ అదాలత్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

     

  • దంపతులకు రాజీ కుదిర్చిన లోక్ అదాలత్

    సూర్యాపేట: తుంగతుర్తి జూనియర్ సివిల్ జడ్జి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. సివిల్ జడ్జ్ గౌస్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకున్నారు. తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన పర్వతం మధు, శ్రీవాణి దంపతులు లోక్ అదాలత్‌లో రాజీకీ వచ్చారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

  • చెరువులో పడి గేదెల కాపరి మృతి

    సూర్యాపేట: చెరువులో పడి గేదెల కాపరి మృతి చెందిన సంఘటన శనివారం కోదాడ మండలం దొరకుంట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భాతరాజు మైసయ్య (52) గేదెల కాపరిగా పని చేస్తున్నారు. రోజులాగానే పనికి వెళ్లిన ఆయన చెరువులో గేదెలను తోలి పైకి వస్తున్న క్రమంలో జారిపడి నీటిలో మునిగిపోయాడు. స్థానికులు గమనించి బయటకు తీయగా.. అప్పటికే మృతి చెందాడు.

  • ‘రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలి’

    మ‌హ‌బూబాబాద్: జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన నేష‌న‌ల్ లోక్ అదాల‌త్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కక్షిదారులు చిన్నచిన్న కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. క్షణికావేశంలో గొడవలు, ఘర్షణలకు దిగి అమూల్యమైన సమ‌యాన్ని వృథా చేసుకోకుండా, వాటిని రాజీమార్గంలో పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • ఆత్రం సుగుణక్కకు సన్మానం

    ఆదిలాబాద్: ఉట్నూర్ మండల కేంద్రంలోని సుగుణక్క నివాసంలో శనివారం ఆమెను కాంగ్రెస్ పార్టీ ఇచ్చోడ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయన సుగుణక్కను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఆత్రం సుగుణక్క నూతనంగా నియమితులైన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

  • ఉచిత కంటి వైద్య శిబిరం

    మహబూబాబాద్: లక్ష్మీపురం గ్రామంలో శనివారం సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాంకుడోత్ నవీన్ నాయక్ పాల్గొని శిబారాన్ని ప్రారంభించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. 50 మందికి పరీక్షలు నిర్వహించి, వారిలో 12 మందిని ఆటోలో కంటి శాస్త్ర చికిత్స కోసం సూర్య హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు.

  • ఖాళీ బిందెలతో మహిళల నిరసన

    నిర్మల్: కుభీర్ మండలం నిగ్వ గ్రామంలో నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసందర్భంగా శనివారం పలువురు మహిళలు ఖాళీ నీటి బిందెలతో గ్రామ పంచాయతీ ముందు నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామంలో బోరు మోటార్లు పని చేయక నీటికి తీవ్ర ఇబ్బంది అవుతుందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేయాలని కోరారు.

  • తాటి చెట్టు పైనుంచి పడి గీతకార్మికుడి మృతి

    జయశంకర్ భూపాల‌ప‌ల్లి: తాటి చెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు మృతి చెందిన సంఘటన శనివారం రేగొండ మండలం జూబ్లీనగర్ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన తాళ్లపెళ్లి రాములు శుక్రవారం రాత్రి తాడిచెట్టు ఎక్కి కిందికి దిగే క్రమంలో మోకు జారి ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

  • ‘నేతన్న భరోసాను అమలు చేయాలి’

    యాదాద్రి భువనగిరి: మోత్కూర్ మండలం పాలడుగులో శనివారం చేనేత కార్మికుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన నేతన్న భరోసాను వెంటనే అమలు చేసి, అర్హత కలిగిన ప్రతి చేనేత కార్మికునికి పథకాన్ని అందించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

  • సింగరేణి ఆసుపత్రిని తనిఖీ చేసిన జీఎం

    పెద్దపల్లి: గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిని శుక్రవారం ఆర్జీ-1 జీఎం లలిత్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన హాస్పిటల్‌లో మందుల స్టోరేజ్‌ పరిస్థితి, పేషెంట్‌‌లకు అందిస్తున్న మందుల వివరాలను ఫార్మసి కౌంటర్‌ వద్ద ఉద్యోగులను, కార్మికులు, అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు, వారి కుటుంబాలకు మంచి వైద్యం అందించాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.