Author: Shivaganesh

  • మాజీ ఎంపీటీసీకి నాయకుల నివాళి

    కరీంనగర్: చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డితో కలిసి పర్యటించారు. ఈసందర్భంగా వారు రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎంపీటీసీ చాడ శోభ నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి వారి కుటుంబసభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు.

  • భట్పల్లిలో అక్షరాభ్యసం..

    కొమురం భీమ్: కాగజ్‌నగర్ మండలం భట్పల్లి గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎంఈఓ మాసాల ప్రభాకర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు పలువురు విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించి, నోటు పుస్తకాలు, ఏక రూప దుస్తులు పంపిణీ చేశారు.

  • సీఎంను కలిసిన మంత్రి అడ్లూరి

    కరీంనగర్: జూబ్లీహిల్స్‌లో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించిన నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామెల్, తోట లక్ష్మీకాంతరావు, కాలె యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

  • రూ.లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

    సంగారెడ్డి: జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన రెజింతల సావిత్రి అనారోగ్యంతో బాధపడుతూ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం ఆమెకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.లక్ష ఎల్ఓసీ చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • అమ్మమాట అంగన్‌వాడీ బాట

    సిద్దిపేట: అక్కన్నపేట మండలం రామవరం సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో శుక్రవారం అమ్మమాట అంగన్‌వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అంగన్‌వాడీ సెంటర్లను ముగ్గులు, తోరణాలతో అలంకరించారు. అనంతరం అంగన్‌వాడీ సిబ్బంది ఇంటింటికి తిరిగి చిన్నపిల్లల తల్లిదండ్రులకు బొట్టుపెట్టి కేంద్రాలకు పంపించాలని కోరారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సుజాత, అంగన్‌వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘ప్రభుత్వ భూమి కబ్జా’

    మెదక్: కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని శుక్రవారం మాజీ సర్పంచ్ రాజేందర్ ఆందోళన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని 447 సర్వే నంబరు భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని వాపోయారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోని, నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.

  • ఈనెల 27న సీపీఐ మహాసభలు

    సిద్దిపేట: హుస్నాబాద్ పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ జిల్లా 4వ మహాసభ ఈనెల 27న జరగనున్నట్లు తెలిపారు. మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • విద్యార్థులకు అక్షరాభ్యాసం

    సంగారెడ్డి: రామచంద్రాపురం శ్రీనివాస్ నగర్ కాలనీలోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలో శుక్రవారం బడిబాట కార్యక్రమంలో ‌భాగంగా విద్యార్థులకు స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ అక్షరాభ్యాసం చేయించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అక్షరభాస్యం చేయాలనే సూచనల మేరకు సామూహిక అక్షరభాస్యం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

  • వివిధ మార్కెట్ల సందర్శనకు హుస్నాబాద్ పాలకవర్గం

    సిద్దిపేట: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం వివిధ మార్కెట్ల సందర్శనలో భాగంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్, మహబూబ్‌నగర్, రాయచూర్ వ్యవసాయ మార్కెట్‌లను సందర్శించారు. ఈసందర్భంగా వారు అక్కడున్న మార్కెట్ వివరాలను, వ్యవసాయ పంటల గురించి తెలుసుకున్నారు. సందర్శన కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కంది తిరుపతిరెడ్డి, వైస్ ఛైర్మన్ బంక చందు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

  • పిడుగుపడి మహిళ మృతి

    మెదక్: పిడుగుపడి మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం శివంపేట మండలం గూడూరులో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కమ్మరి సత్తమ్మ, శ్రీకాంత్ అనే ఇద్దరు వారి వ్యవసాయ పొలానికి వెళ్లి పనులు చేసుకుంటుండగా ఆకస్మాత్తుగా వర్షం రావడంతో చెట్టుకిందకు వెళ్లారు. పిడుగుపడటంతో ఇద్దరు అస్వస్థకు గురయ్యారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. సత్యమ్మ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శ్రీకాంత్‌కు గాయాలు అయ్యాయి.