మెదక్: కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని శుక్రవారం మాజీ సర్పంచ్ రాజేందర్ ఆందోళన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని 447 సర్వే నంబరు భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని వాపోయారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోని, నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.
Author: Shivaganesh
-
ఈనెల 27న సీపీఐ మహాసభలు
సిద్దిపేట: హుస్నాబాద్ పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ జిల్లా 4వ మహాసభ ఈనెల 27న జరగనున్నట్లు తెలిపారు. మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
-
విద్యార్థులకు అక్షరాభ్యాసం
సంగారెడ్డి: రామచంద్రాపురం శ్రీనివాస్ నగర్ కాలనీలోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలో శుక్రవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ అక్షరాభ్యాసం చేయించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అక్షరభాస్యం చేయాలనే సూచనల మేరకు సామూహిక అక్షరభాస్యం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
-
వివిధ మార్కెట్ల సందర్శనకు హుస్నాబాద్ పాలకవర్గం
సిద్దిపేట: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం వివిధ మార్కెట్ల సందర్శనలో భాగంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్, మహబూబ్‌నగర్, రాయచూర్ వ్యవసాయ మార్కెట్‌లను సందర్శించారు. ఈసందర్భంగా వారు అక్కడున్న మార్కెట్ వివరాలను, వ్యవసాయ పంటల గురించి తెలుసుకున్నారు. సందర్శన కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కంది తిరుపతిరెడ్డి, వైస్ ఛైర్మన్ బంక చందు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
-
పిడుగుపడి మహిళ మృతి
మెదక్: పిడుగుపడి మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం శివంపేట మండలం గూడూరులో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కమ్మరి సత్తమ్మ, శ్రీకాంత్ అనే ఇద్దరు వారి వ్యవసాయ పొలానికి వెళ్లి పనులు చేసుకుంటుండగా ఆకస్మాత్తుగా వర్షం రావడంతో చెట్టుకిందకు వెళ్లారు. పిడుగుపడటంతో ఇద్దరు అస్వస్థకు గురయ్యారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. సత్యమ్మ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శ్రీకాంత్‌కు గాయాలు అయ్యాయి.
-
గర్షకుర్తిలో రెవెన్యూ సదస్సు
కరీంనగర్: గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం భూభారతి చట్టంపై రెవెన్యూ సదస్సును నిర్వహించారు. సదస్సులో తహసీల్దార్ అనుపమరావు పాల్గొని చట్టంపై అవగాహన కల్పించారు. సదస్సుకు రైతుల నుంచి పెద్ద స్పందన లభించిందని అధికారులు తెలిపారు. పలువురు రైతులు భూసమస్యల పరిష్కారానికి అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-
కాల్వపల్లిలో గ్రామస్థుల ఆందోళన
ములుగు: తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో శుక్రవారం ప్రజలు ఆందోళన చేశారు. ఈసందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మెదటి విడత ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అర్హులకు లబ్ధి చేకూరలేదని వాపోయారు. ఇళ్లు ఉన్న వారికి, పార్టీ కార్యకర్తలను అర్హులుగా గుర్తించారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు.
-
లారీ ఢీకొని ఒకరి మృతి
వరంగల్: లారీ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం పర్వతగిరి మండలం రావూరు గ్రామంలో చోటుచేసుకుంది. మోత్య తండాకు చెందిన బాదావత్ రాములు అనే వ్యక్తి రావూరు గ్రామంలో బైక్‌పై వెళ్తుండగా లారీ వెనుక నుంచి ఢీకొనింది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
-
బాధ్యతలు స్వీకరించిన కొత్త బాస్..
సంగారెడ్డి: జిల్లా నూతన కలెక్టర్ పి.ప్రావీణ్య శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఐబి గెస్ట్ హౌస్‌కు చేరుకున్న కలెక్టర్ పి.ప్రావీణ్యకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్టీఓ రవీందర రెడ్డి మొక్కను అందజేస స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమెను పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
-
రుద్రారంలో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు
సంగారెడ్డి: అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తున్న ఘటన శుక్రవారం పటాన్‌చెరు మండలం రుద్రారంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో వెలుగు చూసింది. కాలేజీలో 245 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. విషయం తెలుసుకొని ఎంఈఓ నాగేశ్వర నాయక్ కాలేజీని పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకున్నట్లు ధ్రువీకరించారు. అడ్మిషన్లు నిర్వహించిన గదిని సీజ్ చేశారు.