Author: Shivaganesh

  • ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేత

    మెదక్: శివంపేట మండల పరిధిలో భీక్యతాండ గ్రామపంచాయతీలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముందుగా  లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రెటరీ అందజేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

  • ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

    సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్, డ్రైవర్ కాలనీలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్లకు ఎంపీ సురేష్ శెట్కార్, జహీరాబాద్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి చంద్రశేఖర్, సెట్విన్ ఛైర్మన్ గిరిధర్ రెడ్డిలు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు కచ్చితంగా ఇస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

  • స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

    సిద్దిపేట: హుస్నాబాద్ పట్టణంలో 100 రోజుల కార్యక్రమ కార్యచరణలో భాగంగా శుక్రవారం పుర కమిషనర్ టి.మల్లికార్జున్ 16 వ వార్డులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన వార్డులో నీరు నిల్వ ఉన్నచోట్ల ఆయిల్ బాల్స్, స్ప్రే, బ్లీచింగ్ చేశారు. అనంతరం ఆయన ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

  • గంగ్వార్‌లో బీజేపీ నాయకుల సమావేశం

    సంగారెడ్డి: న్యాల్కల్ మండలం గంగ్వార్ చౌరస్తాలోని రామలింగేశ్వర ఆలయంలో శుక్రవారం బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేష్ గంగ్వార్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పార్టీ జహీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నౌబాద్ జగన్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 ఏళ్ల పరిపాలన గురించి, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరించారు.

  • తొలిసారిగా ఖనిజాల అన్వేషణకు సింగరేణి..

    పెద్దపల్లి: సింగరేణి సంస్థ కీలకమైన ఖనిజాల రంగంలోకి తొలిసారిగా అడుగుపెట్టింది. శుక్రవారం భువనేశ్వర్‌లో CSIR–IMMTతో ఉమ్మడి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
    ఈ ఒప్పందం ద్వారా ఖనిజ అన్వేషణ, ఉత్పత్తిలో ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. ఒప్పంద సమావేశంలో సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, CSIR డైరెక్టర్ డా.రామానుజ్ పాల్గొన్నారు. ఇకపై ఫ్లైయాష్, బొగ్గు, క్లేల్లో ఖనిజాల ఉత్పత్తిపై పరిశోధన కొనసాగనుంది.

  • దోమల నిర్మూలనకు చర్యలు

    పెద్దపల్లి: వర్షాకాలం నేపథ్యంలో లక్ష్మీపురం గ్రామంలో శుక్రవారం “డ్రై డే–ఫ్రై డే” కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి పాల్గొని మాట్లాడుతూ.. దోమల నిర్మూలన కోసం ఫాగింగ్, ఆయిల్ బాల్స్ వాడకంతో పాటు, కాల్వల పూడిక తొలగింపు పనులు జరుగుతున్నాయని తెలిపారు.
    కార్యక్రమంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్లు నాగభూషణం, కుమారస్వామి, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

  • బాసర ఆలయంలో వేలం పాట

    నిర్మల్: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ దుకాణ సముదాయాలకు శుక్రవారం వేలం నిర్వహించారు. వేలం పాట ద్వారా దేవస్థానానికి రూ.33,98,007 ఆదాయం సమకూరింది. పండ్ల విక్రయానికి రూ.12.5 లక్షలు, కొబ్బరి ముక్కల సేకరణకు రూ.16.11 లక్షలు అధిక ధర పలికాయి. వేలం ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. వేలంలో ఏఈఓ, దేవాదాయ శాఖ సిబ్బంది, టెండర్ దారులు పాల్గొన్నారు.

  • ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన మంత్రి సీతక్క

    మహబూబాబాద్: గూడూరు మండలం గోవిందాపూర్‌లో శుక్రవారం మంత్రి సీతక్క పర్యటించారు. ఈసందర్భంగా ఆమె పలువురు లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం అర్హులందరికి లబ్ధి చేకూరుస్తుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ సింగ్, అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • కోడలిపై గొడ్డలితో మామ దాడి ..

    జగిత్యాల: కోడలిపై గొడ్డలితో మామ దాడి చేసిన ఘటన శుక్రవారం గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన నారాయణకు, తన అన్న కోడలు సత్త. లతకు మధ్య కొన్ని ఏళ్లుగా భూవివాదాలు ఉన్నాయి. శుక్రవారం పొలం వద్దకు వారిఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. నారాయణ, సత్త లతపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన లతను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

  • పెన్షన్ సమస్యలపై సమీక్ష

    పెద్దపల్లి: రామగుండం ఏరియా–1 సమావేశ మందిరంలో శుక్రవారం CMPF జాయింట్ వర్క్‌షాప్ నిర్వహించారు. సమావేశంలో గోదావరిఖని CMPF రీజినల్ కమిషనర్ హరిపచౌరి, గోవర్దన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా వారు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత నిధులు ఆలస్యం కాకుండా చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.