Author: Shivaganesh

  • ఆర్జీయూకేటీలో ప్రేరణాత్మక ఉపన్యాసం

    నిర్మల్: ఆర్జీయూకేటీలో శుక్రవారం విద్యార్థులకు మానసిక ఉత్సాహం, విద్యాపరమైన విజయాలు సాధించేందుకు ప్రేరణాత్మక ఉపన్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉపకులపతి ప్రొఫెసర్ గోవర్ధన్ పాల్గొని శ్రమ, ఆత్మవిశ్వాసం, సమయ నిర్వహణపై మాట్లాడారు. నిజ జీవిత గాథలు ఉదహరిస్తూ, విశ్వవిద్యాలయం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

  • కీలకమైన ముందడుగు..

    నిర్మల్: బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల లిఖిత కమ్యూనికేషన్ సామర్థ్యాలను పెంపొందించేందుకు శుక్రవారం కీలకమైన ముందడుగు వేసింది. ఈసందర్భంగా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ.. విద్యార్థులు, అధికారులకు వివిధ సందర్భాల్లో సరైన భాష, వ్యాకరణ, శైలీ, ఫార్మాట్ లోపం లేకుండా లేఖలు రాయడానికి ఉపయోగపడే లేఖ నమూనాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇంగ్లీష్ విభాగం అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

  • మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

    మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలో శుక్రవారం మంత్రి సీతక్క సమక్షంలో ఎంచగూడకు చెందిన జిట్టబోయిన రాములు, జున్ను రవీందర్, తుపాకుల ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం చేపటడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • రహమాత్ హుస్సేన్‌ను సన్మానించిన ముస్లింలు

    కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనారిటీ నాయకులు, టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియమితులైన రహమత్ హుస్సేన్‌ను శుక్రవారం ముస్లింలు సన్మానించారు. మొదటిసారి కరీంనగర్‌‌కు వచ్చిన ఆయనను జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షబ్బీర్, తదితరులు సన్మానించారు. కార్యక్రమంలో షాదుల్లాలు, దావూద్, తదితరులు పాల్గొన్నారు.

  • వృద్ధురాలిని కాపాడిన కానిస్టేబుల్

    నిర్మల్: బాసర గోదావరి నదిలో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడగా ఆమెను కానిస్టేబుల్ కాపాడిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా గ్రామకంటం గ్రామానికి చెందిన వృద్ధురాలు ఇంట్లో గొడవపడి గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. గమనించిన కానిస్టేబుల్ మోహన్ సింగ్ ఆమెను రక్షించి, తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానిస్టేబుల్‌ను బాసర ఎస్సై, గ్రామస్థులు అభినందించారు.

  • ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు అందజేత

    ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ వార్డ్ నంబర్ 34లో శుక్రవారం 22 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్‌స్పెక్టర్ నరేందర్, జూనియర్ అకౌంటెంట్ కార్తీక్, కౌన్సిలర్ జోగు ప్రేమేందర్ పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

  • భూమి రికార్డు ఇప్పించాలని ఎమ్మార్వోకు వినతి

    నిర్మల్: బాసర గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం స్థానిక తహసీల్దార్ పవన్ చంద్ర ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మార్వో రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. గ్రామానికి చెందిన బలగం.భాస్కర్ తన 22 గుంటల భూమికి పట్టా పాస్ బుక్, రికార్డులను ఇప్పించాలని ఎమ్మార్వోకు వినతి అందజేశారు. సమస్యను పరిశీలించి, పరిష్కరిస్తామని ఎమ్మార్వో రైతుకు భరోసా కల్పించారు.

     

  • చెక్కులు అందజేసిన మంత్రి సీతక్క

    మహబూబాబాద్: కొత్తగూడ & గంగారం ఉమ్మడి మండలాల లబ్ధిదారులకు శుక్రవారం కళ్యాణలక్ష్మి,  షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణ కోసం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ సింగ్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

     

  • ఆస్పత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

    మంచిర్యాల: లక్షెటిపేట్ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  పర్యటించారు. ఈసందర్భంగా ఆయన స్థానికంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • నస్పూర్‌లో ఉచిత వైద్య శిబిరం

    మంచిర్యాల: నస్పూర్ నగరపాలిక పరిధిలోని సంఘమల్లయ్య పల్లెలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. వంద రోజుల సమగ్ర ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. క్షయ రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.