నిర్మల్: జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 88 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని శుక్రవారం ఎస్పీ జానకి షర్మిల తిరిగి బాధితులకు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు WWW.CEIR.GOV.IN లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్ రికవరీలో పోర్టల్ ఆవశ్యకతను వివరించారు. ఇప్పటివరకు జిల్లాలో రూ.1.69 కోట్ల విలువైన 1416 ఫోన్ల రికవరీ అయ్యాయని పేర్కొన్నారు.
Author: Shivaganesh
-
‘ఫీజు చెల్లింపులో రాయితీ కల్పించాలి’
నిర్మల్: జిల్లా విద్యాధికారిని శుక్రవారం TSJU అధ్యక్షుడు జవాన్ సుదర్శన్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో 50% ఫీజు రాయితీ కల్పించాలని డీఈఓను కోరినట్లు పేర్కొన్నారు. డీఈఓ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు.
-
‘ధర్నాను విజయవంతం చేయాలి’
యాదాద్రి భువనగిరి: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం క్షౌర వృత్తిదారుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల భిక్షం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన క్షౌర వృత్తిదారుల సమస్యలపై ఈనెల 17 న ఇందిరా పార్క్‌లో జరగనున్న ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
-
రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న కలెక్టర్
యాదాద్రి భువనగిరి: భువనగిరి మండలంలోని పెంచికల్ పహాడ్ గ్రామంలో శుక్రవారం భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను సవివరంగా అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కచ్చితంగా కృషి చేస్తామని రైతులకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో అంజిరెడ్డి, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
-
సీపీఐ మహాసభల లోగో ఆవిష్కరణ
మహబూబాబాద్: కురవి మండల కేంద్రంలో జూలై 5, 6 తేదీల్లో జరగనున్న సీపీఐ జిల్లా 3వ మహాసభల లోగోను శుక్రవారం పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా కురవి మండల కేంద్రంలోనీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహాసభలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
-
యువకుడిని కాపాడిన ఆదిలాబాద్ పోలీసులు
ఆదిలాబాద్: ఓయువకుడు పోలీసులు కాపాడిన ఘటన శుక్రవారం ఆదిలాబాద్ పట్టణం రవీంద్రనగర్‌లో వెలుగుచూసింది. శుక్రవారం ఆదిలాబాద్ ఒకటవ పట్టణ సీఐ బి.సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. రవీంద్రనగర్‌కు చెందిన మహమ్మద్ ఫైసల్ (25) గురువారం రాత్రి తన తండ్రికి వీడియో సందేశం పంపించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఫైసల్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు వడ్డాడి ప్రాజెక్ట్ వద్ద ఫైసల్‌ను సురక్షితంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
-
‘వాగు ఆక్రమణ.. వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి’
ఆదిలాబాద్: తాంసి మండలకేంద్రంలో శుక్రవారం భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్వోను మాజీ ఎంపీపీ అరుణ్ కుమార్ కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలకేంద్రంలోని వాగును లింగం గౌడ్ అనే వ్యక్తి ఆక్రమించాడని, గతంలో ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు.
-
ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి: బీబీనగర్ మండలంలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల పటాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంత రావు పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కరరావు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
-
బాసరలో చిన్నారులకు అక్షరాభ్యాసం..
నిర్మల్: బాసర మండలం రవీంద్రపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే చిన్నారులకు శుక్రవారం జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం పూజలు చేయించారు. ఈసందర్భంగా పాఠశాల హెచ్ఎం మమ్మాయి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు బలగం రాధిక, తదితరులు పాల్గొన్నారు.
-
‘ఆదివాసీల సాగు భూములకు హక్కులు కల్పించాలి’
ములుగు: ఆదివాసీల సాగు భూములకు హక్కులు కల్పించాలని గొండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ అన్నారు. గురువారం ఆయన వెంకటాపురం మండలంలోని కొమరంభీం కాలనీలో మీడియాతో మాట్లాడారు. వాడగూడెంలో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ భూములను రక్షించడంలో అధికారులు విఫలమైయ్యారని విమర్శించారు. సమావేశంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు.