సిద్దిపేట: హుస్నాబాద్ ఏబీవీపీ శాఖ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం స్థానికంగా నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథులుగా మెదక్, సిద్ధిపేట జిల్లాల సంఘటన మంత్రి లక్ష్మీపతి పాల్గొన్నారు. ఆయన ఆయన ఆధ్వర్యంలో సంఘం జిల్లా కన్వీనర్ ఆదిత్య నూతన నగర కమిటీని ప్రకటించారు. నగర కార్యదర్శిగా భీమగోని చరణ్, ఉపాధ్యక్షులుగా రాహుల్, రాజు, సంయుక్త కార్యదర్శులుగా అంజి, రాహుల్, కమిటీ సభ్యులను ప్రకటించారు.
Author: Shivaganesh
-
ఎంపికైన వారికి 3 నెలల శిక్షణ
పెద్దపల్లి: జీవీటీసీ, ఆర్జీ.1 లో గురువారం కిమ్స్ -టెక్ మహీంద్రా ఉచిత శిక్షణ ఇంటర్వ్యూలను నిర్వహించారు. కార్యక్రమాన్ని జీఎం డి. లలిత్ కుమార్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్వ్యూలకు 118 మంది దరఖాస్తు చేసుకోగా 85 మంది హాజరయ్యారన్నారు. ఎంపికైన వారికి హైదరాబాద్‌లో 3 నెలల శిక్షణ, ఉచిత భోజనం, వసతి ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం రూ.15 – 25 వేల వేతనంతో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
-
గనికార్మికులకు మార్గనిర్దేశం..
పెద్దపల్లి: ఆర్‌జి రీజియన్ జీఎం ఎస్.మదుసూదన్ గురువారం జీడీకె-11 ఇంక్లైన్‌ను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన సేఫ్టీ పరంగా డిస్ట్రిబ్యూషన్ పాయింట్‌ను పరిశీలించి, భద్రత చర్యలపై గనికార్మికులకు మార్గనిర్దేశం చేశారు. అనంతరం ఆయన గనికి సంబంధించిన మ్యాపులు, భూగర్భంలో తీసుకున్న రక్షణ చర్యలను తనిఖీ చేసి సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో జీఎం (ఎస్‌ఓటు) శ్రీ గోపాల్ సింగ్, ఏజెంట్ సి.శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
-
‘జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి’
ఆదిలాబాద్: అలమడుగు మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు, రెండు జతల దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంఈఓ వెంకటరమణ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మంచిగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో శేఖర్, పాఠశాల ఛైర్మన్ సునంద, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
-
‘అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి’
సిద్దిపేట: అక్కన్నపేట మండలం రామవరం సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గురువారం అమ్మమాట అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రాలను ముగ్గులు, తోరణాలతో అలంకరించి, ఇంటింటికి వెళ్లి చిన్నారుల తల్లిదండ్రులకు బొట్టుపెట్టి అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలను పంపించాలని కోరారు. బాలింతలు, గర్భిణులు, అంగన్‌వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సుజాత, తదితరులు పాల్గొన్నారు.
-
అంగన్‌వాడీ సిబ్బంది వినూత్న ప్రచారం
సిద్దిపేట: కోహెడ మండల సెక్టార్ పరిధిలోని బస్వాపూర్ అంగన్‌వాడీ కేంద్రాలలో గురువారం అమ్మమాట అంగన్‌వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ జయమ్మ పాల్గొని ట్రీ గార్డెన్, అంగన్‌వాడీ బడిబాట ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి చిన్నారుల తల్లిదండ్రులకు బొట్టు పెట్టి పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-
విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందజేత
ఆదిలాబాద్: జైనథ్ మండలం జామిని ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయుడు శరత్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు నోట్ బుక్స్, పాఠ్యపుస్తకాలు, రెండు జతల దుస్తులు అందజేశామని అన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం శరత్ కుమార్ యాదవ్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
-
గనుల్లో భద్రతపై అవగాహన కార్యక్రమం
పెద్దపల్లి: ఆర్జీ–1 జీఎం డి.లలిత్ కుమార్ నేతృత్వంలో గురువారం జి.డి.కే 1 & 3 ఇంక్లైన్ గనుల్లో ఉద్యోగులకు ఉత్పత్తి, నాణ్యత, రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. 2014 నుంచి ప్రతి జూన్‌లో జరుగుతున్న ప్రాణాంతక ప్రమాదాల నివారణ కార్యక్రమాల్లో భాగంగా భద్రతపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. 100% ఉత్పత్తి సాధించిన ఉద్యోగులను అభినందించారు. సమావేశంలో పలువురు అధికారులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
-
ఝాన్సీ లింగాపూర్‌లో అమ్మమాట అంగన్‌వాడీ బాట
మెదక్: రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ 1, 2 సెంటర్లలలో గురువారం అమ్మమాట అంగన్‌వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సీడీపీఓ స్వరూపరాణి పాల్గొని మాట్లాడుతూ.. పిల్లలను అంగన్‌వాడీ సెంటర్లలో చేర్పించాలని కోరారు. గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ భారతి, అంగన్‌వాడీ టీచర్లు సునీత, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.
-
‘అన్ని మతాల వారు కలిసి ఉండాలి’
సిద్దిపేట: సమాజంలో అన్ని మతాల వారు కలిసి ఉంటేనే సంబంధాలు మెరుగుపడతాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ భవనంలో గురువారం నిర్వహించిన పాస్టర్ల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అందరూ కలిసి సమాజంలో మంచిని పెంచే విధంగా, ఆత్మీయతతో జీవించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాస్టర్లు, క్రిస్టిషయన్లు పాల్గొన్నారు.