Author: Shivaganesh

  • మంత్రి శ్రీహరిని కలిసిన గిరిధర్ రెడ్డి

    సంగారెడ్డి: మంత్రి శ్రీహరిని గురువారం హైదరాబాద్‌లోని వారి నివాసంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎన్.గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈసందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో పని చేసే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఛైర్మన్ శివసేనరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

     

  • రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. భర్తకు తీవ్రగాయాలు

    కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రగాయాలైన ఘటన గురువారం శంకరపట్నం మండలం కాచాపూర్ శివారులో చోటుచేసుకుంది. వీణవంక మండలం బొంతుపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రామస్వామి, పుష్పలీల దంపతులు. వారు బైక్‌పైన వెళ్తుంటే కాచాపూర్ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొనింది. ప్రమాదంలో పుష్పలీల అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రామస్వామిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

  • విటల్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం

    పెద్దపల్లి: గోదావరిఖని పరిధిలోని విటల్‌నగర్‌లో గురువారం రోహిణి ఫౌండేషన్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఏసీపీ రమేష్, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైద్యులు మాట్లాడుతూ.. ప్రజలను పరీక్షించి, ఉచితంగా మందులు అందజేశామన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు నిదిన్, అఖిల, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.

  • ‘కేంద్ర పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలి’

    జగిత్యాల: బుగ్గారం మండల కేంద్రంలో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు మేడవేణి శ్రీధర్ అధ్యక్షతన పార్టీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, రాష్ట్ర స్వచ్ఛ భారత్ కన్వీనర్ మంచే రాజేష్ పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మోదీ పాలనలో దేశాభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేర్చాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

  • తొలకరి జల్లుల పలకరింపుతో.. అన్నదాతలు బిజీబిజీ

    ఆదిలాబాద్: గత మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులు బిజీబిజీగా ఉన్నారు. తాంసి, తలమడుగు, భీంపూర్, జైనథ్, బేల మండలాల అన్నదాతలు గురువారం దుక్కులు దున్నుతూ, విత్తనాలు నాటడంలో నిమగ్నమయ్యారు. అనుకున్నదాని కంటే ముందుగా వర్షాలు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వ్యవసాయానికి ఆశాజనకంగా ఉందని ఆకాంక్షించారు.

  • ‘నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు’

    మెదక్: చేగుంట మండల కేంద్రంలో గురువారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పెట్టిన నిబంధనలతో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామాలకు నిధులు కేటాయించకపోవడంతో ట్రాక్టర్లు నడించలేమని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు కూడా ఎమ్మెల్యేలుగా చేలామణి అవుతున్నారని విమర్శించారు.

  • అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

    మెదక్: నర్సాపూర్ మండల కేంద్రంలోని జక్కపల్లి ఆదర్శ పాఠశాలలో 9 నుంచి 12వ తరగతి వరకు తెలుగు బోధించేందుకు అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఫరానా తెలిపారు. ఎంఏ, బీఈడీ అర్హత కలిగి, బోధనలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ డెమో ద్వారా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల వారు ఈనెల 15 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

  • ‘పనులను వేగంగా పూర్తి చేయాలి’

    జనగామ: జిల్లాలో దయ నిలయం వద్ద నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను బుధవారం అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేకు కందాళ నివాలి

    ఖమ్మం: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసినదే. బుధవారం వారి ఇంటికి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • రాజన్న సన్నిధిలో ఉద్యమ కళాకారుల పూజలు

    రాజన్న సిరిసిల్ల: తెలంగాణ ఉద్యమ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి ఆధ్వర్యంలో సంఘం నాయకులు బుధవారం వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ కళాకారుల హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఉద్యమ కళాకారులు పాల్గొన్నారు.