సిద్దిపేట: కోహెడ మండలం వెంకటేశ్వరపల్లిలో బుధవారం స్థానిక అంగన్‌వాడీ టీచర్ జ్యోత్స్న వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఆమె గ్రామంలో ప్రీ స్కూల్‌కు అర్హులైన పిల్లల ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులకు బొట్టు పెట్టి స్కూల్‌కు పంపించాలని ఆహ్వానించారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ సెంటర్‌లో పిల్లలకు సరైన వసతులు, పోషకాహారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
కొత్తపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు
పెద్దపల్లి: పెద్దపల్లి మండలం కొత్తపల్లిలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, జడ్జి కె.స్వప్నారాణి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చట్టాలను ధిక్కరిస్తే శిక్షలు తప్పవని అన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకుని అనుసరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
అక్రమ భవనాలపై అధికారుల ఉక్కుపాదం
సంగారెడ్డి: అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో అక్రమ భవనాలపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈసందర్భంగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారి పవన్ మాట్లాడుతూ.. కిష్టారెడ్డిపేటలో పలువురు జీ+ 2 అనుమతులు తీసుకుని ఐదారంతస్తులు నిర్మించారిని తెలిపారు. వారి బిల్డింగ్‌ల స్లాబ్‌లను కూల్చివేశామన్నారు. అనుమతులకు మించి అక్రమ భవనాలు నిర్మిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
-
గౌర్నమెంట్ స్కూల్‌కు టీచర్ కొడుకు..
మెదక్: రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. కార్యక్రమంలో భాగంగా బుధవారం రాయలాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రవళిక తన కుమారుడు కార్తీక్‌ను స్థానిక పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలిని మండల విద్యాధికారి శ్రీనివాస్, హెచ్ఎం విట్టల్ దాస్, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు అభినందించారు.
-
‘భూభారతి చట్టంతో రైతుల సమస్యలు తీరుతాయి’
సిద్దిపేట: అక్బర్‌పేట భూంపల్లి మండలంలోని పోతారెడ్డిపేట గ్రామంలో బుధవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. భూభారతి చట్టంతో రైతుల సమస్యలు తీరుతాయని అన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్, రైతులు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
మాజీ మంత్రి కొప్పుల జీవిత చరిత్ర ఆవిష్కరణ
పెద్దపల్లి: ధర్మారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీధర్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జీవిత చరిత్ర “ఒక ప్రస్థానం” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సాధారణ జీవితం, ఉద్యమపరమైన ప్రస్థానం నేటి యువతకు స్ఫూర్తినిచ్చేలా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ పుస్తకాన్ని చదవాలని పిలుపునిచ్చారు.
-
సిర్సపల్లిలో బడిబాట కార్యక్రమం
కరీంనగర్: హుజూరాబాద్ మండలంలోని సిర్సపల్లి గ్రామంలో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మార్వో కనకయ్య పాల్గొని మాట్లాడుతూ.. గ్రామస్థులందరూ కలిసి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలన్నారు. ఈ ఏడాది నుంచి ‘విద్యా వాహిని’ ప్రచార రథాన్ని ప్రతి గ్రామానికి తిప్పే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
-
మంత్రి అడ్లూరిని కలిసిన డీఈఓ
జగిత్యాల: ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాము మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయన మంత్రికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సుహాసిని రెడ్డి
మెదక్: నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎగ్ బిర్యాని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
-
నక్కలపేటలో బడిబాట కార్యక్రమం
జగిత్యాల: ధర్మపురి మండలం నక్కలపేటలో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో జిల్లా విద్యాశాఖాధికారి రాము హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన, అనుభవం, అర్హత ఉన్న ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సీతాలక్ష్మి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.