పెద్దపల్లి: ప్రశాంత్‌నగర్ హనుమాన్ దేవాలయంలో బుధవారం రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా అర్చకులు మాట్లాడుతూ.. ధూప దీప అర్చకులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా మేలు జరగాలని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిట్టూరి సతీష్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
‘లైసెన్స్ తప్పని సరి’
సిద్దిపేట: హుస్నాబాద్ పట్టణంలో బుధవారం 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ టీ.మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుడి పరిసరాల్లో డ్రైనేజీలను శుభ్రపరిచారు. అనంతరం ఇన్‌ఛార్జి మేనేజర్ సంపత్ రావు ఆధ్వర్యంలో షాప్ యజమానులకు ప్రతి ఏడాది ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని, కొత్త షాపుల వారికి లైసెన్స్ తీసుకోవాలని తెలియజేస్తూ నోటీసులు ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.