వరంగల్: ఎన్నికల కమిషన్ తీరును నిరసిస్తూ సోమవారం వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. ఇతర విపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంట్ భవనం వద్ద ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరుగుతోందని, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కావాలని డిమాండ్ చేశారు. తమ పోరాటం రాజ్యాంగాన్ని కాపాడటానికి అని పేర్కొన్నారు.
Author: Shivaganesh
-
దంచికొట్టిన వాన.. రాకపోకలు బంద్
ఆదిలాబాద్: తలమడుగు మండలంలో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి తలమడుగు బ్రీడ్జి వద్ద లోలెవల్ వంతెనపై వరద నీరు పెరగడంతో మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయి. తలమడుగు మండలంలోని ఖోడత్ లోలెవెల్ బ్రిడ్జ్, సుంకిడి భీమన్న వాగు బ్రిడ్జ్, తలమడుగు వాగు బ్రిడ్జ్ నిర్మించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.
-
‘చేపల వేటకు వెళ్లవద్దు’
భద్రాద్రి కొత్తగూడెం: పినపాక మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జాలరులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లవద్దని ఏడుల్లా బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు సూచించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు గ్రామాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయని, వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు సహకరించాలని కోరారు.
-
‘బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్’
హన్మకొండ: గ్రేటర్ వరంగల్ పరిధిలోని రాంపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులు అర్పించి మాట్లాడారు. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, గీతా కార్మికులు పాల్గొన్నారు.
-
‘బహుజనలంతా ఏకం కావాలి’
మహబాబూబాద్: బయ్యారం మండల కేంద్రంలో సోమవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మండ రాజన్న మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిరుపేద కుటుంబంలో పుట్టి గోల్కొండ కోట రాజుగా పరిపాలించడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. బహుజనలంతా ఏకం కావాలని, బహుజన రాజ్యం తీసుకురాడానికి ముందుకు కదలాలని పిలుపునిచ్చారు.
-
చెరువుకు గండి.. మునిగిపోయిన పంటపొలాలు
మెదక్: నర్సాపూర్ మండలంలోని కాజీపేట గ్రామంలో భారీ వర్షాలకు చెరువుకు గండిపడింది. దీంతో చెరువు నీరు వృథాగా పోయి దిగువన ఉన్న పంట పొలాలు మునిగిపోయాయి. ఈసందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ.. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే తరచూ ఇలా జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుకు గండి పడటం ఇది రెండోసారని వాపోయారు. ఘటనపై ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.
-
వీరభద్రుడికి ప్రత్యేక పూజలు
మెదక్: నర్సాపూర్‌లో శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ పూజారి వీరపు గురుస్వామి మాట్లాడుతూ.. ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు నిర్వహించామని తెలిపారు. లలిత సహస్రనామావళి, కుంకుమార్చనలు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
-
‘వినాయక ఉత్సవ కమిటీలు దరఖాస్తు చేసుకోవాలి’
సంగారెడ్డి: వినాయక చవితి ఉత్సవాల కోసం ఉత్సవ కమిటీలు తెలంగాణ పోలీస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని కోహీర్ ఎస్.ఐ. నరేష్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనం కోసం అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా విగ్రహాల ఏర్పాటు కోసం నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అందరూ నిబంధనలు పాటించాలని అన్నారు.
-
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..
మెదక్: ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పిన ఘటన సోమవారం మనోహరాబాద్ మండలం రామయ్యపల్లి వద్ద చోటుచేసుకుంది. రామయ్యపల్లి NH44 పాస్ బ్రిడ్జ్ వద్ద వరదనీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుని ఆగిపోయింది. వెంటనే ప్రయాణికులు బస్సులో నుంచి దిగి మోకాల్లోతు నీళ్లల్లో నడుచుకుంటూ బయటికి వెళ్లారు. అండర్ పాస్ బ్రిడ్జి వద్ద వరద ప్రవాహం తక్కువగా ఉండటంతో ప్రయాణికులకు పెనుప్రమాదం తప్పింది.
-
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఆదిలాబాద్: బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పంపిణీ చేశారు. తాంసి మండలం పాలోడికి చెందిన సిరికుడ విద్యకు రూ. 12, వేలు, జక్కుల సునీల్‌కు రూ. 7, వేలు, తలమడుగు మండలం కురుకుల భీమేశ్వరికి రూ.60, వేలు విలువైన చెక్కులను అందజేశారు. పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ గొప్పవరమని అన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.