Author: Shivaganesh

  • ‘కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయడం లేదు’

    సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం 11 ఏండ్ల పాలనపై బుధవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.వెంకట్‌రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మోడీ ప్రధాని అయ్యాక దేశ ఆర్థికస్థితిని 12వ స్థానం నుంచి 4వ స్థానానికి తీసుకొచ్చారని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయడం లేదని విమర్శించారు.

  • ‘కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు’

    సంగారెడ్డి: కాళేశ్వరం విచారణలో భాగంగా బుధవారం కమిషన్ ముందు హాజరవుతున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా పార్టీ సీనియర్ నాయకులు నామ రవి కిరణ్ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధారంగా మారింది అన్నారు.

  • వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీఎంహెచ్‌వో

    పెద్దపల్లి: పెద్దపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం శిశువులకు రోటాసిల్‌ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో డాక్టర్‌ అన్న ప్రసన్న కుమారి ప్రారంభించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. శిశువులకు తప్పనిసరిగా రోటాసిల్‌ వ్యాక్సిన్‌ వేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. రోటాసిల్‌ వ్యాక్సిన్‌ను 6 వారాల వయస్సు గల శిశువుకు ఓపీవీ, పెంటా వాలెంట్‌ మొదటి డోసుతో పాటు ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

  • ఎంపీఓకు జీపీ ట్రాక్టర్ల తాళాలు అందజేత

    జగిత్యాల: మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన గ్రామపంచాయతీ కార్యదర్శులు బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీఓ జగదీష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు ఆయనకు జీపీ ట్రాక్టర్ల తాళాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమకు వస్తున్న జీతాలతో ప్రతి నెల గ్రామాల్లో సానిటేషన్, ఎలక్ట్రికల్ పనులతో పాటు జీపీ ట్రాక్టర్ల నిర్వహణకు ఖర్చు పెడుతున్నామని వాపోయారు.

     

     

  • ‘గిరిజన గ్రామాలో స్పెషల్ క్యాంపు నిర్వహించాలి’

    పెద్దపల్లి: కలెక్టరేట్‌లో బుధవారం పీఏం జన్‌ మాన్‌, డీఏజేజీయూఏ నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఈనెల 20న స్పెషల్‌ క్యాంపు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఏం జన్‌ మాన్‌, డీఏజేజీయూఏ కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు.

  • అయ్యప్పస్వామి సన్నిధిలో మంత్రి అడ్లూరి

    జగిత్యాల: ధర్మపురి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని బుధవారం మంత్రి హోదాలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు బినాతి అశోక్ మంత్రిని సత్కరించారు. అర్చకులు తీర్థ ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్, తదితరులు పాల్గొన్నారు.

  • అంగన్‌వాడీ టీచర్ వినూత్న ప్రచారం..

    సిద్దిపేట: కోహెడ మండలం వెంకటేశ్వరపల్లిలో బుధవారం స్థానిక అంగన్‌వాడీ టీచర్ జ్యోత్స్న వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఆమె గ్రామంలో ప్రీ స్కూల్‌కు అర్హులైన పిల్లల ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులకు బొట్టు పెట్టి స్కూల్‌కు పంపించాలని ఆహ్వానించారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ సెంటర్‌లో పిల్లలకు సరైన వసతులు, పోషకాహారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

  • కొత్తపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు

    పెద్దపల్లి: పెద్దపల్లి మండలం కొత్తపల్లిలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, జడ్జి కె.స్వప్నారాణి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చట్టాలను ధిక్కరిస్తే శిక్షలు తప్పవని అన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకుని అనుసరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • అక్రమ భవనాలపై అధికారుల ఉక్కుపాదం

    సంగారెడ్డి: అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో అక్రమ భవనాలపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈసందర్భంగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారి పవన్ మాట్లాడుతూ..  కిష్టారెడ్డిపేటలో పలువురు జీ+ 2 అనుమతులు తీసుకుని ఐదారంతస్తులు నిర్మించారిని తెలిపారు. వారి బిల్డింగ్‌ల స్లాబ్‌లను కూల్చివేశామన్నారు. అనుమతులకు మించి అక్రమ భవనాలు నిర్మిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • గౌర్నమెంట్ స్కూల్‌కు టీచర్ కొడుకు..

    మెదక్: రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. కార్యక్రమంలో భాగంగా బుధవారం రాయలాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రవళిక తన కుమారుడు కార్తీక్‌ను స్థానిక పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలిని మండల విద్యాధికారి శ్రీనివాస్, హెచ్ఎం విట్టల్ దాస్, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు అభినందించారు.