Author: Rafi

  • మంత్రి అడ్లూరిని కలిసిన డీఈఓ

    జగిత్యాల: ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాము మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయన మంత్రికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సుహాసిని రెడ్డి

    మెదక్: నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎగ్ బిర్యాని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

     

  • నక్కలపేటలో బడిబాట కార్యక్రమం

    జగిత్యాల: ధర్మపురి మండలం నక్కలపేటలో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో జిల్లా విద్యాశాఖాధికారి రాము హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన, అనుభవం, అర్హత ఉన్న ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సీతాలక్ష్మి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

  • హనుమాన్ ఆలయంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

    పెద్దపల్లి: ప్రశాంత్‌నగర్‌ హనుమాన్‌ దేవాలయంలో బుధవారం రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా అర్చకులు మాట్లాడుతూ.. ధూప దీప అర్చకులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా మేలు జరగాలని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిట్టూరి సతీష్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

  • ‘లైసెన్స్ తప్పని సరి’

    సిద్దిపేట: హుస్నాబాద్ పట్టణంలో బుధవారం 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ టీ.మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుడి పరిసరాల్లో డ్రైనేజీలను శుభ్రపరిచారు. అనంతరం ఇన్‌ఛార్జి మేనేజర్ సంపత్ రావు ఆధ్వర్యంలో షాప్ యజమానులకు ప్రతి ఏడాది ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని, కొత్త షాపుల వారికి లైసెన్స్ తీసుకోవాలని తెలియజేస్తూ నోటీసులు ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.