Author: Shivaganesh

  • వైభవంగా గజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం

    సంగారెడ్డి: అమీన్‌పూర్ మున్సిపల్ కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో గజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ నరసింహ గౌడ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి’

    మెదక్: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండొద్దని, అత్యవసరం అయితే బయటకు వెళ్లాలని సూచించారు. వాగుల వద్దకు వెళ్లొద్దన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

  • కౌడిపల్లి మండలంలో అత్యధిక వర్షపాతం..

    మెదక్: నర్సాపూర్ నియోజకవర్గంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామున 6 గంటల వరకు భారీ వర్షం కురిసింది. కౌడిపల్లి మండలంలో అత్యధికంగా 172.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. వెల్దుర్తి, మాసాయిపేట, శివంపేట, కొల్చారం, నర్సాపూర్‌లలోనూ అధిక వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలతో నియోజకవర్గంలోని చెరువులన్నీ నిండి అలుగులు పారుతున్నాయి.

  • ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

    హన్మకొండ: కాజీపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బొల్లికొండ యాదగిరి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల, పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.  కార్యక్రమంలో బుర్ర బాబురావు, మోడం రాజేష్, బండి కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

  • పెద్దమ్మతల్లి దేవాలయంలో చోరీ..

    సిద్దిపేట: దేవాలయంలో దొంగతనం జరిగిన ఘటన సోమవారం అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో వెలుగుచూసింది. గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగలు అమ్మవారి అర్థతులం బంగారు ముక్కుపుడక, 20 వేల రూపాయల విలువగల రెండు గుడి గంటలు ఎత్తుకెళ్లారు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • సారూ.. కాలుపెట్ట సందు లేదు.. ఆగాగు

    భద్రాద్రి కొత్తగూడెం: జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. కోయిదా నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్న బస్సులో అశ్వారావుపేటలో కాలు పెట్టడానికి సందులేదని స్థానిక ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులో సుమారుగా 130 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ మార్గంలో ఒక్కటే బస్సు సర్వీసు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించాలని కోరారు.

  • ఎమ్మెల్యేకు Big Folk Night కార్యక్రమ ఆహ్వానం

    కుమ్రం భీం: BIGTV ఆధ్వర్యంలో ఈనెల 23న సాయంత్రం 6 గంటలకు LB స్టేడియంలో జరిగే Big Folk Night-2025 ఆహ్వాన పత్రికను సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబుకు స్టాఫ్ రిపోర్టర్ ఇర్ఫాన్ అందించారు. ఒకే వేదికపై తెలంగాణలోని జానపద కళాకారులు ఆట, పాటలతో అలరించనున్నారని వివరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహిస్తున్న అతిపెద్ద తొలి జానపద పాటల కార్యక్రమం ఇదే కావడం విశేషం.

  • సగం కూలిన ఇల్లు.. అధికారులు స్పందించండి

    మెదక్: నర్సాపూర్‌లోని మార్కెట్ రోడ్డులో శిథిలావస్థలో ఉన్న ఓ ఇల్లు భారీ వర్షాలకు సగం కూలిపోయింది. ఈ ఇల్లు ఉన్న మార్గం ప్రధాన దారి కావడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన గోడలు ఎప్పుడైనా కూలవచ్చని, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

  • అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..

    సంగారెడ్డి: ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి రూ. 2.75 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బొల్లారంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.  కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషన్, మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, హనుమంత్‌రెడ్డి, చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • జలదిగ్భందంలో ఏడుపాయల ఆలయం

    మెదక్: సింగూర్ డ్యాం గేట్లు ఎత్తడంతో మంజీరా నది ఉప్పొంగుతుంది. మంజీర నది ఉధృత ప్రవాహం కారణంగా ఏడుపాయల ఆలయం జలదిగ్భందం అయ్యింది. దుర్గమ్మ పాదాలను గంగమ్మతకుతూ ముందుకు సాగుతుంది. దీంతో రాజగోపురం వద్ద అమ్మవారికి పూజలు చేస్తున్నారు. ఏడుపాయలుగా ముందుకు పోతున్న నదీ ప్రవాహం పర్యాటకులను కనువిందు చేస్తుంది.