జగిత్యాల: ధర్మపురి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, స్కావెంజర్లకు పాఠశాలల పరిశుభ్రతపై గురువారం ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. స్కావెంజర్లు జయశ్రీ, రాజన్న ప్రాక్టికల్ డెమో ఇవ్వగా, రిసోర్స్ పర్సన్ సంతోష్ పరిశుభ్రత, నిర్వాహణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, స్కావెంజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Author: Rafi
-
ఏకరూప దుస్తులు అందజేసిన ఆంజనేయులు గౌడ్
మెదక్: నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, ఏకరూప దుస్తులు అందజేత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
-
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మెదక్: శివంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన కుంట ప్రవళిక అనారోగ్యంతో బాధపడుతూ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.75 వేల ఎల్‌వోసీని చెక్కును గురువారం ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి గొప్పవరం అని అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
-
మైనర్ బాలిక కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష
జగిత్యాల: గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. గురువారం కేసు కోర్టు విచారణకు రాగా న్యాయమూర్తి C.రత్నపద్మావతి నిందితుడు రెడపాక శ్రీనివాస్‌కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.12,200 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
-
మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన నాయకులు
మంచిర్యాల: చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి వివేక్ వెంకటస్వామిని గురువారం హైదారాబాద్ సోమాజిగూడలోని వారి నివాసంలో కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు ఆయనకు పూల బొకే అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. మంత్రిగా వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంతో పాటు, రాష్ట్రానికి మరిన్ని మంచి పనులు చేస్తారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
-
నర్సాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం
మెదక్: నర్సాపూర్ పట్టణంలోని హనుమంతపూర్‌లో గురువారం ప్రభుత్వ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా డాక్టర్ ప్రియాంక రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ అశోక్ గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ మహేష్, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
-
ఈనెల 15న వైదిక పాఠశాల ప్రవేశ పరీక్ష
సంగారెడ్డి: ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని శ్రీ దత్తగిరి మహారాజ్ వైదిక పాఠశాల ప్రవేశ పరీక్షలను ఈనెల 15న నిర్వహిస్తున్నట్లు పాఠశాల వ్యవస్థాపకులు సిద్దేశ్వరానందగిరి మహారాజ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర నుంచి 200 వరకు దరఖాస్తులు వచ్చాయని, ఇంకా ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆరు ఏండ్ల పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
-
బడిబాట ప్రచారానికి ఎమ్మెల్యే సొంత వాహనం అందజేత
కరీంనగర్: గంగాధర మండలం మల్లాపూర్ గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన సొంత వాహనాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. బడిబాట కార్యక్రమం ముగిసేంతవరకు వాహనానికి అయ్యే ఇంధన ఖర్చులను కూడా తానే భరిస్తానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
-
అమ్మమాట అంగన్‌వాడీ బాట కార్యక్రమం
సిద్దిపేట: హుస్నాబాద్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని హుస్నాబాద్ -VI అంగన్‌వాడీ సెంటర్లో గురువారం అమ్మమాట అంగన్‌వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీడీపీఓ జయమ్మ హాజరై బడిబాట ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మూడేళ్లు నిండిన పిల్లల ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు బొట్టుపెట్టి అంగన్‌వాడీలకు పంపించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు అంగన్‌వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-
ఈనెల 14న జిల్లాలో క్రికెట్ జట్టు ఎంపిక
సిద్దిపేట: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 14 అండర్ 19 సిద్ధిపేట జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈసందర్భంగా సిద్ధిపేట జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కలకుంట్ల మల్లిఖార్జున్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధిపేట క్రికెట్ స్టేడియంలో జట్టును ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 01, 2006 తర్వాత జన్మించిన వారు ఎంపికకు అర్హులన్నారు.