Author: Rafi

  • ‘అన్ని మతాల వారు కలిసి ఉండాలి’

    సిద్దిపేట: సమాజంలో అన్ని మతాల వారు కలిసి ఉంటేనే సంబంధాలు మెరుగుపడతాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ భవనంలో గురువారం నిర్వహించిన పాస్టర్ల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అందరూ కలిసి సమాజంలో మంచిని పెంచే విధంగా, ఆత్మీయతతో జీవించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాస్టర్లు, క్రిస్టిషయన్లు పాల్గొన్నారు.

  • ‘కొత్త మంత్రి పాత సమస్యలపై దృష్టి సారించాలి’

    మంచిర్యాల: చెన్నూర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా మంత్రి పదవి చేపట్టిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలోని ప్రధానమైన పాత సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. స్థానికంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • కోతుల బెడదకు చెక్‌

    పెద్దపల్లి: రామగుండం నగరంలో కోతుల సమస్యకు పరిష్కారం చూపేందుకు రూ.10 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ తెలిపారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆమోదంతో, కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు బుధ, గురువారాల్లో రైల్వే స్టేషన్ పరిసరాల్లో కోతులను పంజరాల్లో బంధించినట్లు పేర్కొన్నారు.  ఇంకా ఎక్కడైనా కోతుల బెడద ఉంటే 9603666444 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

  • విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందజేత

    జగిత్యాల: వెల్గటూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఇన్‌ఛార్జి స్కూల్ ప్రిన్సిపాల్ టి.పద్మాలత ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ జూపాక ప్రవీణ్ తదితరులు పాల్గొని విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

  • రైతు భరోసాకు దరఖాస్తుల ఆహ్వానం

    మెదక్: రామాయంపేట వ్యవసాయ డివిజన్ పరిధిలో కొత్త పట్టా పాస్ బుక్‌లు కలిగిన రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని గురువారం ఇన్‌ఛార్జి వ్యవసాయ డివిజన్ అధికారి రాజునారాయణ తెలిపారు. చేగుంట, రామాయంపేట, నార్సింగి, నిజాంపేట మండలాలలో సుమారు 910 కొత్త పట్టాపాస్ బుక్‌లు కలిగిన అన్నదాతలు ఉన్నారని పేర్కొన్నారు. వారు వ్యవసాయ కార్యాలయంలో ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

     

  • ‘విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి’

    సంగారెడ్డి: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని వావిలాల ప్రభుత్వ హై స్కూల్, ప్రైమరీ స్కూల్‌లలో గురువారం విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  • ‘విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలి’

    సంగారెడ్డి: కొండాపూర్ మండలం తొగరుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఎంఈఓ దశరథ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, రెండు జతల ఏకరూప (యూనిఫామ్స్) దుస్తులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.  బోధన విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

  • మంత్రి శ్రీహరిని కలిసిన గిరిధర్ రెడ్డి

    సంగారెడ్డి: మంత్రి శ్రీహరిని గురువారం హైదరాబాద్‌లోని వారి నివాసంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎన్.గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈసందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో పని చేసే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఛైర్మన్ శివసేనరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

     

  • రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. భర్తకు తీవ్రగాయాలు

    కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రగాయాలైన ఘటన గురువారం శంకరపట్నం మండలం కాచాపూర్ శివారులో చోటుచేసుకుంది. వీణవంక మండలం బొంతుపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రామస్వామి, పుష్పలీల దంపతులు. వారు బైక్‌పైన వెళ్తుంటే కాచాపూర్ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొనింది. ప్రమాదంలో పుష్పలీల అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రామస్వామిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

  • విటల్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం

    పెద్దపల్లి: గోదావరిఖని పరిధిలోని విటల్‌నగర్‌లో గురువారం రోహిణి ఫౌండేషన్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఏసీపీ రమేష్, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైద్యులు మాట్లాడుతూ.. ప్రజలను పరీక్షించి, ఉచితంగా మందులు అందజేశామన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు నిదిన్, అఖిల, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.