జగిత్యాల: బుగ్గారం మండల కేంద్రంలో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు మేడవేణి శ్రీధర్ అధ్యక్షతన పార్టీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, రాష్ట్ర స్వచ్ఛ భారత్ కన్వీనర్ మంచే రాజేష్ పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మోదీ పాలనలో దేశాభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేర్చాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
Author: Rafi
-
తొలకరి జల్లుల పలకరింపుతో.. అన్నదాతలు బిజీబిజీ
ఆదిలాబాద్: గత మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులు బిజీబిజీగా ఉన్నారు. తాంసి, తలమడుగు, భీంపూర్, జైనథ్, బేల మండలాల అన్నదాతలు గురువారం దుక్కులు దున్నుతూ, విత్తనాలు నాటడంలో నిమగ్నమయ్యారు. అనుకున్నదాని కంటే ముందుగా వర్షాలు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వ్యవసాయానికి ఆశాజనకంగా ఉందని ఆకాంక్షించారు.
-
‘నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు’
మెదక్: చేగుంట మండల కేంద్రంలో గురువారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పెట్టిన నిబంధనలతో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామాలకు నిధులు కేటాయించకపోవడంతో ట్రాక్టర్లు నడించలేమని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు కూడా ఎమ్మెల్యేలుగా చేలామణి అవుతున్నారని విమర్శించారు.
-
అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం
మెదక్: నర్సాపూర్ మండల కేంద్రంలోని జక్కపల్లి ఆదర్శ పాఠశాలలో 9 నుంచి 12వ తరగతి వరకు తెలుగు బోధించేందుకు అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఫరానా తెలిపారు. ఎంఏ, బీఈడీ అర్హత కలిగి, బోధనలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ డెమో ద్వారా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల వారు ఈనెల 15 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
-
‘పనులను వేగంగా పూర్తి చేయాలి’
జనగామ: జిల్లాలో దయ నిలయం వద్ద నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను బుధవారం అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
-
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేకు కందాళ నివాలి
ఖమ్మం: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసినదే. బుధవారం వారి ఇంటికి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
రాజన్న సన్నిధిలో ఉద్యమ కళాకారుల పూజలు
రాజన్న సిరిసిల్ల: తెలంగాణ ఉద్యమ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి ఆధ్వర్యంలో సంఘం నాయకులు బుధవారం వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ కళాకారుల హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఉద్యమ కళాకారులు పాల్గొన్నారు.
-
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్రగాయాలు
పెద్దపల్లి: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలైన ఘటన బుధవారం ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రం మొగిళి చెందిన ట్రాక్టర్‌కు అదే గ్రామానికి చెందిన గసిగంటి శీను డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఓ రైతు భూమి చదును చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి పక్కన ఉన్న గుంతలో పడిపోవడంతో శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
-
కాళికామాతకు ప్రత్యేక పూజలు
మెదక్: వెల్దుర్తి మండలంలోని మన్నేవార్, జలాల్పూర్ గ్రామాల్లో బుధవారం పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ కాళికా మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, స్థానికంగా ఉన్న గోశాలలోని గోవులకు పండ్లు, బక్షాలు పెట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
-
‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’
సంగారెడ్డి: జహీరాబాద్ మండలం కొత్తూరు గ్రామంలోని రైతు వేదికలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించారు. వచ్చే వానాకాలం పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పించారు. పంటసాగులో మార్పిడి చేయడం వలన సుస్థిర ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.