Author: Rafi

  • బాధిత కుటుంబాలకు మంత్రి అడ్లూరి పరామర్శ

    పెద్దపల్లి: ధర్మారం మండలం చామనపెల్లి గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతంతో 52 గొర్రెలు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • ధర్మపురి దేవస్థానం రోజువారి ఆదాయ వివరాలు

    జగిత్యాల: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి బుధవారం రూ.1,54,114 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. వివిధ కార్యక్రమాల టికెట్లు ద్వారా రూ.71,264 రాగా, ప్రసాదాల ద్వారా రూ.68,610, అన్నదానం ద్వారా
    రూ.14,240 వచ్చినట్లు పేర్కొన్నారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.

     

  • కమలాపూర్‌లో బడిబాట కార్యక్రమం

    జగిత్యాల: ధర్మపురి మండలం కమలాపూర్‌లో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా విద్యా అధికారి రాము పాల్గొని మాట్లాడుతూ.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడు నూనావత్ రాజేష్ తన పిల్లలు అనిరుధ్, అన్విత, అక్షరలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సీతాలక్ష్మి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

  • లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి

    జగిత్యాల: గొల్లపల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పేదింటి వారి సొంతింటి కలను నెరవేర్చాలని ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

  • ‘కమిషన్ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు’

    హన్మకొండ: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఏర్పాటు చేసిన కమిషన్‌ ముందుకి బుధవారం కేసీఆర్‌ హాజరు అయ్యారు. ఈక్రమంలో ఆయనకు మద్దతుగా హైదరాబాద్‌కు పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌ భాస్కర్‌ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కమిషన్‌ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • రెస్టారెంట్లపై అధికారుల దాడి.. 12 మందిపై కేసు నమోదు

    భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ పట్టణంలోని పలు రెస్టారెంట్లు, హోటల్స్‌, టీ స్టాల్స్‌పై బుధవారం సివిల్ సప్ల‌య్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు దాడి చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమర్షియల్స్ గ్యాస్ సిలిండర్లకు బదులుగా గృహ అవసరాలకు వాడే సిలిండర్లను (డొమెస్టిక్) వాడటాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఈక్రమంలో 35 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని, 12 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • సుందరమ్మ జాతరలో పాల్గొన్న రాజిరెడ్డి

    మెదక్: హత్నుర మండల కేంద్రంలో బుధవారం శ్రీ సుందరమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. జాతరలో ముఖ్యఅతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి ఆవుల రాజిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, పాల్గొన్నారు.

  • ‘భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

    మెదక్: నర్సాపూర్ మండలంలోని చిప్పల్‌తుర్తి గ్రామంలో బుధవారం భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూభారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

    సంగారెడ్డి: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీశ్రీశ్రీ జగన్నాథ స్వామి దేవాలయంలో బుధవారం విశ్వశాంతి మహా యజ్ఞం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

  • వాణిజ్య లైసెన్సులను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

    సంగారెడ్డి: అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి బుధవారం మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లో పర్యటించారు. ఈసందర్భంగా ఆమె స్థానికంగా ఉన్న వ్యాపార దుకాణాలకు వెళ్లి వారి వాణిజ్య లైసెన్సులను తనిఖీ చేశారు. అనంతరం మున్సిపాలిటీలోని పలు కాలనీల్లోని నీటి కాల్వలను పరిశీలించి, వాటిలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని, మట్టిని తొలగింపజేయించారు.