Author: Rafi

  • సింగరేణి – పీఎన్బీ మధ్య బీమా ఒప్పందం

    పెద్దపల్లి: హైదరాబాద్‌లో సింగరేణి-CSCMD ఎన్.బలరామ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈవో అశోక్ చంద్ర మధ్య బుధవారం రూ.1.25 కోట్ల ప్రమాద బీమా ఒప్పందం కుదిరింది. ఈసందర్భంగా సింగరేణి ఎండీ మాట్లాడుతూ.. ఇది సింగరేణి ఉద్యోగులకు శాలరీ అకౌంట్ ప్యాకేజీగా గుర్తింపు పొందిందని అన్నారు. సాధారణ మరణానికి రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.

  • వినూత్నంగా అంగన్‌వాడీలకు పంపించాలని ఆహ్వానం

    సిద్దిపేట: కోహెడ మండలం శనిగరం సెక్టార్ పరిధిలోని వింజపల్లి 1, 2 అంగన్‌వాడీ కేంద్రాల్లో బుధవారం అమ్మ మాట అంగన్‌వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సెంటర్ల ముందు ముగ్గులు, తోరణాలతో అలంకరించారు. అనంతరం చిన్నారులు ఉన్న ఇండ్లకు వెళ్లి తల్లులకు బొట్టు పెట్టి పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించమని ఆహ్వానించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సీడీపీఓ జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.

  • ఏరువాక పౌర్ణమి ప్రత్యేక పూజలు

    సంగారెడ్డి: సదాశివపేట మండలం తంగేడుపల్లి గ్రామ శివారులోని శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం, శ్రీశ్రీశ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమంలో బుధవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం గోశాల ప్రారంభోత్సవం, గోపూజలు నిర్వహించారు. అనంతరం మహా మంగళార హారతి, భక్తులకు మహా అన్నదాన ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గోమాతను దర్శనం చేసుకున్నారు.

  • ‘రైతులకు రుణాలు ఇవ్వాలి’

    మహబూబాబాద్: జిల్లా పర్యటనలో ఉన్న జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్‌ను బుధవారం గూడూరు మండలంలోని రైతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు ఆయనకు RFRO పట్టాలు కలిగి ఉన్నా తమకు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించిన ఆయన గూడూరులోని యూనియన్ బ్యాంక్ అధికారులతో సమావేశమై సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

  • అధికారులను సస్పెండ్ చేయాలని కలెక్టర్‌కు వినతి

    వరంగల్‌: కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారదను బుధవారం విముక్త చిరుతల పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చెరిపల్లి ఆనంద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయన కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో గత వారం రోజులుగా చెరువు మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని, వారికి సహకరిస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని కోరినట్లు తెలిపారు.

  • ‘పోలీసు సిబ్బంది కుటుంబాలకు అండగా నిలుస్తాం’

    వరంగల్: సీపీ కార్యాలయంలో బుధవారం అనారోగ్యంతో మరణించిన పోలీస్ కానిస్టేబుల్ వెంకట్ రమణ కుటుంబానికి సీపీ సన్ ప్రీత్ సింగ్ రూ. 7.72 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విధులు నిర్వహిస్తూ ఆకస్మికంగా మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా నిలుస్తామని అన్నారు. బాధిత కానిస్టేబుల్ కుటుంబం స్థితిగతులపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

  • ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రం ప్రారంభం

    వరంగల్: నర్సంపేట పట్టణంలోని రామ్ చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ వరంగల్ ఆధ్వర్యంలో బుధవారం ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద పాల్గొని సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సేకరణ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ఉమారాణి, ఎమ్మార్వో రవిచంద్ర రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

  • ‘భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి’

    పెద్దపల్లి: గోదావరిఖని ప్రభుత్వ, సింగరేణి ఆసుపత్రులను బుధవారం ఏసీపీ ఎం.రమేష్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన ఆస్పత్రుల్లో భద్రత ఏర్పాట్లను పరిశీలించి, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిల్లల అపహరణలు, వైద్య సిబ్బందిపై దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తనిఖీలో ఆసుపత్రి సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

  • బాధిత కుటుంబాలను ఆదుకున్న మంత్రి పొన్నం

    సిద్దిపేట: బీఆర్ఎస్ రజతోత్సవ సభ ముగించుకుని వెళ్తున్న వాహనం ఢీకొని కోహెడ మండలం బస్వాపూర్‌కు చెందిన తాడేం సారయ్య, బండోజు గణేష్‌లు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించి, ఒక్కొక్కరి కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

     

  • అభ్యంతరాలు తెలుసుకున్న షాహీద్ మసూద్

    పెద్దపల్లి: రామగుండం నగర పాలక సంస్థలో వార్డుల పునర్వ్యవస్థీకరణను బుధవారం పురపాలక ప్రాంతీయ సంచాలకుడు షాహీద్ మసూద్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామితో సమావేశమై సూచనలు, అభ్యంతరాలు తెలుసుకున్నారు. అనంతరం మూడవ డివిజన్‌లో వంద రోజుల ప్రణాళిక పనుల నిర్వాహణను పరిశీలించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.