హన్మకొండ: పరకాల పట్టణంలో బుధవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన బస్సు పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.









