Author: Shivaganesh

  • వాగులో మహిళ గల్లంతు.. మృతదేహం లభ్యం

    ములుగు: తాడ్వాయి మండలం కాల్వపల్లిలో జ్వరంతో బాధపడుతున్న సగలం గౌరమ్మ అనే మహిళ ఆసుపత్రికి వెళ్లే క్రమంలో తుమ్మల వాగులో గల్లంతైంది. సోమవారం ఉదయం ఆమె మృతదేహం వాగు ఒడ్డున లభ్యమైంది. ఆమె బయటకి వెళ్లినప్పుడు వరద ఉధృతం కావడంతో వాగులో పడి పోయి ఉంటారని, ఆమె ఎవరూ గమనించక పోవడంతో మరణించి ఉంటారనిస్థానికులు తెలిపారు.

  • ‘బ్రిడ్జి పనులను పూర్తి చేయాలి’

    మెదక్: హవేలీ ఘన్పూర్ మండలం దూప్ సింగ్ తండా బ్రిడ్జిని బీజేపీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా ఈ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోయిందని, ప్రతిసారి భారీగా వర్షాలు పడ్డప్పుడు తండా వాసులు వేరే గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. అధికారులు స్పందించి వెంటనే బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని కోరారు.

  • చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

    మంచిర్యాల: చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం జన్నారం మండలం కొత్తపేటలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఆత్రం భీము (30) కొత్తపేట చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో కాలుజారి నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై అనూష ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

  • ‘ఇసుక లారీలపై చర్యలు తీసుకోవాలి’

    జయశంకర్ భూపాలపల్లి: మేడారం వెళ్లే రహదారిపై ఇసుక లారీలు విధ్వంసకాండను సృష్టిస్తున్నట్లు స్థానికులు వాపోయారు. ఈసందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ.. బయ్యాక్కపేట, గొల్లబుద్దారం రహదారుల మీదుగా వెళ్లే ఈ లారీల కారణంగా ఆయా రోడ్లన్ని గుంతలమయం అయ్యాయన్నారు. ఇసుక దందాపై స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.

  • ప్రమాదం అంచున హల్దీ వాగు.. ఏ క్షణమైనా..

    మెదక్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా జన జీవనం స్తంభించిపోయింది. భారీ వరద కారణంగా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ వద్ద హల్దీవాగుపై ఉన్న చెక్ డ్యామ్ రక్షణ గోడ కొట్టుకుపోయింది. ఏ క్షణమైన చెక్ డ్యామ్ గోడ కొట్టుకుపోయే ప్రమాదంలో ఉందని సమాచారం. చెక్ డ్యామ్ దిగువ ప్రాంతాల్లో వేలాది ఎకరాల పంట పొలాలు ఉన్నాయి.

  • నేడు గిరిజన దర్బార్

    భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం ఉదయం 10:30 గంటలకు గిరిజన దర్బార్ కార్యక్రమం జరతుందని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు. గిరిజనులు వారి సమస్యలపై అర్జీలను అందజేయాలని, ఈ కార్యక్రమం గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా అని తెలిపారు.

  • ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

    మహబూబాబాద్: చిన్నగూడరు మండలం గుండంరాజుపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక గౌడ సంఘం నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ బహుజన వీరుడని కొనియాడారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • యూరియా కోసం రైతుల ధర్నా

    మహబూబాబాద్: గూడూరు మండలకేంద్రంలోని యూరియా కోసం రైతులు రహదారిపై నిరసనకు దిగారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. యూరియా కోరత లేకుండా చూడాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సీఐ సూర్యప్రకాష్, ఎస్సై గిరిధర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్  రైతులతో మాట్లాడి, ప్రతి రైతుకు తప్పనిసరిగా యూరియా అందే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

  • అదృష్టమంటే ఇదే.. కారు కొట్టుకుపోయినా..!

    సంగారెడ్డి: వాగు దాటుతుండగా ఓ కారు కొట్టుకుపోయిన ఘటన సోమవారం నారాయణఖేడ్ నియోజకవర్గంలో వెలుగుచూసింది. వాసర్ వాగు వద్ద ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తోంది. పోలీసుల హెచ్చరికలను కాదని వాగు దాటేందుకు ఓ కారు ప్రయత్నించగా, వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో కారు కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తూ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

  • రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి..

    సంగారెడ్డి: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం సదాశివపేట మండలంలో వెలుగుచూసింది. ఆరూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.