Author: Shivaganesh

  • భారీ వర్షాలకు కూలిపోయిన ఇల్లు..

    సంగారెడ్డి: భారీ వర్షాల కారణంగా ఓ ఇల్లు కూలిపోయిన ఘటన పుల్కల్ మండలం పత్తికుంట తండాలో వెలుగుచూసింది. ఇటీవల వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తికుంట తండాలోని ఓ ఇల్లు కూలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో తల్లి సునీత, కుమారుడు కార్తిక్ నిద్రిస్తున్నారు. ప్రమాదంలో కార్తీక్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వాపోయారు.

  • కాగజ్‌నగర్‌‌లో బీజేపి నాయకుల ముందస్తు అరెస్ట్..

    కుమ్రం భీం: పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం కాగజ్‌నగర్‌ డివిజన్ అటవిశాఖ కార్యాలయం ముట్టడికి బీజేపి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పిలుపునిచ్చారు. ఈక్రమంలో ఆయనను పోలీసులు హౌస్ చేశారు. అనంతరం పోలీసులు నియోజకవర్గ బీజేపి నాయకులను ముందస్తుగా  అరెస్ట్ చేసి వివిధ పోలిస్ స్టేషన్‌లకు తరలించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. అక్రమ అరెస్ట్‌లతో తమ పోరాటాన్ని ఆపలేరన్నారు.

  • ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్..

    కుమ్రంభీం: కాగజ్‌నగర్‌‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబును సోమవారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోడు భూముల సమస్య,  49 జీఓ రద్దు కోసం నేడు ఫారెస్ట్ ఆఫీసు ముట్టడికి ఎమ్మెల్యే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయనను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనను అక్రమంగా హౌస్ అరెస్టు చేసారని అన్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

  • రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి..

    వరంగల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన నల్లబెల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట గ్రామానికి చెందిన నేతావత్ వెంకన్న(55) బైక్‌పై మరిపెడ బంగ్లాకు వెళ్తుండగా, రుద్రగూడెం శివారు మలుపు వద్ద బైక్ అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.

  • ‘వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దు’

    మెదక్: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. ఆదివారం టేక్మాల్ మండలంలో పర్యటించిన ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. అధికారులు సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని అన్నారు.

  • ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్

    మెదక్: జిల్లాలో వరదల సహాయక చర్యల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంట్రోల్ రూమ్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించి, అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

  • బ్రిడ్జిపైకి నీరు.. రాకపోకలు బంద్

    మెదక్: తూప్రాన్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కిష్టాపూర్, యావపూర్ గ్రామాల మధ్య బ్రిడ్జి పూర్తిగా జలమయం అయ్యింది. ప్రయాణికులు ఈ మార్గంలో వెళ్లవద్దని తహసీల్దార్ సూచించారు. అత్యవసర సహాయం కోసం 9666206665, 9391942216 నంబర్లను సంప్రదించాలని అన్నారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారని, ప్రజలందరూ అవసరమైతేనే బయటికి రావాలని అన్నారు.

  • నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

    ఆదిలాబాద్: కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. జిల్లాలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటే  18004251939 టోల్ ఫ్రీ నంబరుకు సంప్రదించాలని కోరారు.

  • 19న జిల్లాస్థాయి  అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

    మెదక్: తెలంగాణ రాష్ట్ర జూనియర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 11వ పోటీల్లో భాగంగా ఈనెల 19న మెదక్ శాయ్ స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లె టిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మధు సూదన్ ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 14, 16, 18, 20, బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున పాల్గొంటారన్నారన్నారు

  • నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం 

    ఖమ్మం: ఖమ్మం నగరంలోని బుర్‌హాన్‌పురం ఉపకేంద్రం బస్టాండ్ ఫీడర్ పరిధిలో సోమవారం ఉదయం 9 నుంచి 11 వరకు, మామిళ్లగూడెం ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి 12 వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ రవికుమార్ తెలిపారు. మరమ్మతుల కారణంగా  మామిళ్లగూడెం, బుర్హాన్ పురం, బస్ డిపో రోడ్డు, మయూరిసెంటర్ పరిసరాల్లో విద్యుత్తు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులందరూ గమనించి సహకరించాలన్నారు.