Author: Shivaganesh

  • 19న డీఈసెట్ స్పాట్ అడ్మిషన్లు

    ఖమ్మం: డీఈసెట్-2025 స్పాట్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలైనట్లు ఖమ్మం డైట్ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ బాలమురళీ ఓ ప్రకటనలో తెలిపారు. ర్యాంకు సాధించి సీటురాని అభ్యర్థులు ఈనెల 19న ఖమ్మం డైట్ కాలేజీలో నిర్వహించనున్న స్పాట్ అడ్మిషన్‌లో పాల్గొనాలన్నారు. ఖమ్మం కళాశాలలో ఇంగ్లిషు మీడియంలో ఐదు, తెలుగు మీడియంలో 8 సీట్లు ఉన్నాయని తెలిపారు.

  • నేడు ప్రజావాణి కార్యక్రమం

    వరంగల్: కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం. 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే కార్యక్రమంలో జిల్లా ప్రజలు వారి సమస్యలు విన్నవించుకోవచ్చన్నారు. గ్రేటర్ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి ఉంటుందని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు.

     

  • నేడు, రేపు స్పాట్ కౌన్సెలింగ్

    హన్మకొండ: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డీఈడీ కాలేజీలలో ఖాళీ సీట్ల భర్తీకి సోమ, మంగళవారాల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు హన్మకొండ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ.అబ్దులై ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగులో 3, ఆంగ్లంలో 7, ఉర్దూలో 26 సీట్లు మిగిలినట్లు చెప్పారు.  ‘డీఈఈసెట్-25’లో అర్హత సాధించి, ఇది వరకు ఏ కాలేజీలో సీటు పొందని వారు హాజరు కావాలన్నారు. వివరాలకు 90304 92595 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

     

  • ఎమ్మెల్యేకు Big Folk Night కార్యక్రమ ఆహ్వానం

    మంచిర్యాల: BIGTV ఆధ్వర్యంలో ఈనెల 23న సాయంత్రం 6 గంటలకు LB స్టేడియంలో జరిగే Big Folk Night-2025 ఆహ్వాన పత్రికను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు స్టాఫ్ రిపోర్టర్ ఇర్ఫాన్ అందించారు. ఒకే వేదికపై తెలంగాణలోని జానపద కళాకారులు ఆట, పాటలతో అలరించనున్నారని వివరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహిస్తున్న అతిపెద్ద తొలి జానపద పాటల కార్యక్రమం ఇదే కావడం విశేషం.

  • ‘యూరియా కొరత లేకుండా చూడాలి’

    మహబూబాబాద్: నెల్లికుదురు మండలం శ్రీరామగిరిలో యూరియా కొరత తీవ్రంగా ఉందని స్థానిక రైతులు వాపోయారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే రైతులు PACS కేంద్రాల వద్ద యూరియా కోసం బారులు తీరారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వారం రోజులుగా యూరియా దొరకడం లేదని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి యూరియా కోరత లేకుండా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.

  • న్యాల్కల్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

    సంగారెడ్డి: న్యాల్కల్ మండలంలో ఆదివారం జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పర్యటించారు. ఈసందర్భంగా ఆయన చీకుర్తిలో భారీ వర్షాల కారణంగా పొంగిన వాగులు, దెబ్బతిన్న రోడ్డులను, పాఠశాల భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమలో పలువురు మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన నాయకులు

    భద్రాద్రి కొత్తగూడెం: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పర్స వెంకట్ పలువురు బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ప్రజాప్రభుత్వంలో అర్హులందరికి పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో దేవాలయ వైస్ ఛైర్మన్ గుజ్జ పూర్ణ, పార్టీ మండల నాయకులు చింతల నరసింహారావు, బొల్లికొండ సత్యం, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • యువరాజ్‌కు నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్యే

    జనగామ: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా నీలం యువరాజ్ నియమితులయ్యారు. ఈసందర్భంగా ఆయనకు ఆదివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి నియామక పత్రం అందజేశారు. అనంతరం యువరాజ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించినట్లు తెలిపారు. తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

  • ‘ప్లాస్టిక్ వాడకంపై నిషేధాన్ని విధించాలి’

    సంగారెడ్డి: సదాశివపేటలో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా పలువురు స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కారణంగా వర్షాకాలంలో డ్రైనేజీలు నిండిపోయి, రోడ్లపైకి నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలున్నా, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, అన్నారు. పట్టణంలో ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ఉన్నతాధికారులను కోరారు.

     

  • నిరసన తెలిపిన కాలనీవాసులు

    సంగారెడ్డి: సదాశివపేట పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలో రోడ్లు లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం పలువురు స్థానికులు రోడ్డుపై మొక్కలు నాటి నిరసన తెలిపారు. ఈసందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. పదేళ్లుగా రోడ్డు వేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ కాలనీకి రోడ్లు వేయాలని వారు కోరారు.