జనగామ: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా నీలం యువరాజ్ నియమితులయ్యారు. ఈసందర్భంగా ఆయనకు ఆదివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి నియామక పత్రం అందజేశారు. అనంతరం యువరాజ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించినట్లు తెలిపారు. తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Author: Shivaganesh
-
‘ప్లాస్టిక్ వాడకంపై నిషేధాన్ని విధించాలి’
సంగారెడ్డి: సదాశివపేటలో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా పలువురు స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కారణంగా వర్షాకాలంలో డ్రైనేజీలు నిండిపోయి, రోడ్లపైకి నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలున్నా, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, అన్నారు. పట్టణంలో ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ఉన్నతాధికారులను కోరారు.
-
నిరసన తెలిపిన కాలనీవాసులు
సంగారెడ్డి: సదాశివపేట పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలో రోడ్లు లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం పలువురు స్థానికులు రోడ్డుపై మొక్కలు నాటి నిరసన తెలిపారు. ఈసందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. పదేళ్లుగా రోడ్డు వేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ కాలనీకి రోడ్లు వేయాలని వారు కోరారు.
-
చోరీ.. కేసు నమోదు
ఖమ్మం: ఆస్పత్రికి వెళ్లి వచ్చేలోపు ఇంట్లో చోరీ జరిగిన ఘటన చింతకాని మండలం వందనం గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన షేక్ సైదాబీ శనివారం ఆస్పత్రికి వెళ్లారు. ఇదే సమాయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం ధ్వంసం చేసి, బీరువాలోని బంగారు ఆభరణాలను చోరీ చేశారు. తిరిగి వచ్చిన ఆమె చోరీ జరిగినట్లు గుర్తించి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై నాగుల్ మీరా తెలిపారు.
-
‘ప్రతిరోజూ పాలన’లో పాల్గొన్న ఎమ్మెల్యే..
భద్రాద్రి కొత్తగూడెం: దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ఆదివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రతిరోజు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన పలు సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను త్వరగతిన పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
-
‘భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై స్పందించాలి’
భద్రాద్రికొత్తగూడెం: మణుగూరు అంబేద్కర్ సెంటర్ వద్ద ఆదివారం పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
-
‘తమ భూములకు కావాలనే విలువ పెంచలేదు’
వరంగల్: మామ్మునుర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం సంగెం మండలం గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాల్లో దాదాపు 100 ఎకరాల భూమిని రైతులు కోల్పోతున్నారు. 15 ఏళ్లుగా తమ భూముల రిజిస్ట్రేషన్ విలువను ప్రభుత్వం కావాలనే పెంచలేదని, అందుకే నేడు తక్కువ ధర కట్టిందని రైతులు వాపోయారు. చుట్టుపక్కల భూములకు విలువ పెంచినా, ఎయిర్‌పోర్ట్ కింద పోయే తమ భూమికి మాత్రం విలువ పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
-
అటవీశాఖ కార్యాలయం ముట్టడికి ఎమ్మెల్యే పిలుపు
కుమ్రం భీం: అటవీ అధికారుల దౌర్జన్యాలను ఖండిస్తూ ఆగస్టు 18న కాగజ్‌నగర్ అటవీ కార్యాలయాన్ని ముట్టడించాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు రైతులకు పిలుపునిచ్చారు. జి.ఓ. నెం. 49ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోడు రైతుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం చేపట్టిందని తెలిపారు. రైతుల హక్కుల కోసం ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
-
గాలిస్తున్నా.. జాడ తెలియరాలేదు..
మహబూబాబాద్: గంగారం మండలంలోని ఏడు బావుల జలపాతం వద్ద శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లాకు చెందిన ప్రేమ్ కుమార్ (23) అనే పర్యాటకుడు కనిపించకుండా పోయాడు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి చీకటి కారణంగా గాలింపు నిలిపివేయగా, ఆదివారం ఉదయం నుంచి తిరిగి ప్రారంభించారు. ఇంకా అతని జాడ తెలియరాలేదని పలువురు అధికారులు తెలిపారు.
-
నూతన కమిటీ ఎన్నిక
జనగామ: పాలకుర్తి మండల కేంద్రంలో ఆదివారం ముదిరాజ్ యూత్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. యూత్ అధ్యక్షుడిగా ఎల్లబోయిన సోమేష్, ఉపాధ్యక్షుడిగా మామిండ్ల శోభన్ బాబు, కోశాధికారులుగా రేగుల కృష్ణ, జీడి వినోద్ ఎన్నికయ్యారు. ఈసందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న విగ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ఈ ఏటా కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు.