Author: Shivaganesh

  • సర్టిఫికెట్ కోర్సులకు ఉచిత శిక్షణ..

    ఆదిలాబాద్: సంగీతం, కూచిపూడి నృత్యం, సంగీత వాయిద్యం కళల్లో సర్టిఫికెట్ కోర్సులకు ఉచిత శిక్షణ అందిస్తామని శ్రీకోకిల డ్యాన్స్, సంగీత నృత్య శిక్షణ అకాడమీ నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదోతరగతి పాసైన 16 – 40 ఏళ్లలోపు యువతులు, మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తివివరాలకు 9000127178, 8790251541 నంబర్లను సంప్రదించాలని కోరారు. సర్టిఫికెట్ కోర్సుల్లో ఉత్తీర్ణులైనవారు గురుకులాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

  • దరఖాస్తులకు ఆహ్వానం..

    ఆదిలాబాద్: జిల్లాలోని మహాత్మా జ్యోతిబాఫులే బీసీ గురుకుల పాఠశాలలు, కాలేజీలో ఆంగ్ల మాధ్యమంలో బోధించుటకు అతిథి ఉపాధ్యాయులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కన్వీనర్ శ్రీధర్, డీసీఓ కీర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18న డెమో, ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, బీ.ఎడ్ పూర్తి చేసి టెట్ అర్హత కలిగి ఉండాలన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  • ‘350 మందికి పైగా చికిత్స’

    మెదక్: రామాయంపేట మండల వ్యాప్తంగా గత జనవరి నుంచి 350 పైగా కుక్కకాటు బాధితులు ఆస్పత్రిలో వైద్యం చేసుకున్నారని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ హరిసింగ్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో సరిపడా రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రేబిస్ వ్యాధి సోకకుండా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.

  • ‘పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలి’

    మెదక్: ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో పర్యాటకులు జాగ్రత్త ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. జిల్లా సరిహద్దుల్లోని పోచారం ప్రాజెక్టు, ఏడుపాయల ప్రాజెక్టులతో పాటు మంజీరా నది పుష్పాల వాగు, పసుపులేరు, ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. జిల్లాలో మరో రెండు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు.

  • బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా శంకర్ గౌడ్

    మెదక్: రామాయంపేట మున్సిపాలిటీకి చెందిన బీజేపీ నాయకుడు శంకర్ గౌడ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ ప్రకటించిన నూతన కార్యవర్గంలో ఆయన చోటుకల్పించారు. ఈసందర్భంగా శంకర్ గౌడ్‌కు ఆయన నియామక పత్రాన్ని అందజేశారు. ఈ పదవికి తనను ఎంపిక చేసినందుకు అధ్యక్షుడికి శంకర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

  • ‘మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు’

    మెదక్: యువత డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని రామాయంపేట ఎస్సై బాలరాజు సూచించారు. మండల పరిధిలోని అక్కన్నపేట రైల్వే స్టేషన్‌లో పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు ఎవరైనా విక్రయించినా, సేవించిన, అక్రమ రవాణా చేసిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

  • డెంగీ కేసు ఫైల్..

    ఖమ్మం: మదిరోరోడ్డు లీలాసుందరయ్యనగర్ పరిధిలో ఓ వ్యక్తికి డెంగీ జ్వరం నిర్ధారణ జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే వైద్య, పురపాలకశాఖ అధికారులు అప్రమత్తమైన స్థానికంగా శనివారం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు.

  • జలపాతం వద్ద పర్యాటకుడు మిస్సింగ్..

    మహబూబాబాద్: జలపాతం వద్ద ఓ పర్యాటకుడు గల్లంతైన ఘటన శనివారం రాత్రి గంగారం మండలం ఏడుబావుల జలపాతం వద్ద చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్కూర్ మండలం జెన్నారానికి చెందిన ప్రేమ్ కుమార్ (25) అనే వ్యక్తి తన స్నేహితులతో జలపాతాన్ని చూడటానికి వచ్చారు. ఈక్రమంలో ఆయన జలపాతం వద్ద గలంతయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • సేవానిరతిని చాటుకున్న ఎస్సై…

    మహబూబాబాద్: నర్సంపేట నుంచి గంగారం వరకు భారీ వర్షాలకు రహదారి దెబ్బతినడంతో రాకపోకలు ఆగిపోయాయి. సమస్యను పరిష్కరించడానికి ఎస్సై రవికుమార్ సిబ్బందితో కలిసి రోడ్డు మరమ్మతు పనులను చేపట్టారు. మధ్యాహ్నం కావడంతో ఆయన సిబ్బందితో కలిసి రోడ్డుపై కూర్చోని భోజనం చేస్తూ తన సేవానిరతిని చాటుకున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహాయం చేస్తున్న ఎస్సైని గంగారం ప్రజలు అభినందించారు.

  • మద్యంమత్తు.. షాక్ కొట్టింది

    కుమ్రం భీం: మద్యంమత్తులో ఉన్న ఓయువకుడికి షాక్‌ కొట్టిన ఘటన శనివారంరాత్రి కాగజ్‌నగర్‌లో వెలుగుచూసింది. కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లోని ఫ్లైఓవర్ సమీపంలో మద్యం మత్తులో గూడ్స్ రైల్ ఎక్కిన యువకుడికి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడి రైలు నుంచి కిందపడిపోయాడు. జీఆర్పీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వ్యక్తిని ఓల్డ్‌కాలనీకి చెందిన కృష్ణ యాదవ్‌గా గుర్తించారు.