Author: Shivaganesh

  • నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

    మహబూబాబాద్: మరిపెడ మండలం పురుషోత్తమయి గూడెం గ్రామానికి చెందిన బత్యం వీరన్న అనే యువకుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మరణించారు. విషయం తెలుసుకొని వారి ఇంటికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

  • జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

    సంగారెడ్డి: పటాన్‌చెరు డివిజన్ జేపీ కాలనీలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో శనివారం జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరిపై భగవంతుడి చల్లని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

  • ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

    సంగారెడ్డి: జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తెలిపారు. హెడ్ క్వార్టర్‌లో నిత్యం అందుబాటులో ఉండాలని జిల్లా అధికాలు, సిబ్బందిని ఆదేశించారు. ఎమర్జెన్సీ సమయంలో డయల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656739కు కాల్ చేయాలని సూచించారు.

  • పొంగిపొర్లుతున్న వాగులు… నిలిచిపోయిన రాకపోకలు

    జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. మహాముత్తారం మండలంలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద వాగు, కోణంపేట వాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో అడవి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కాటారం-మేడారం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరం అయితే తప్పా బయటికి రావద్దని కోరారు.

  • రెండు రోజులు నీటి సరఫరా బంద్..

    హన్మకొండ: మడికొండ గ్రామంలో గ్రేటర్ నల్లా నీటి సరఫరా నిలిచిపోయింది. ఈసందర్భంగా పలువురు GWMC సిబ్బంది మాట్లాడుతూ.. వాటర్ ట్యాంక్ వాల్ పని చేయడం లేదని, రెండు రోజులు ఈ సమస్య కొనసాగుతుందని, ట్యాంక్ వాల్ మరమ్మతులు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. మరమ్మతులు పూర్తి అయిన వెంటనే నీటి సరఫరా చేస్తామన్నారు. GWMC అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

  • గుర్తుతెలియని మృతదేహం లభ్యం..

    సిద్ధిపేట: గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన కోమటిచెరువులో వెలుగుచూసింది. స్థానిక కోమటిచెరువలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన  స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన వన్ టౌన్ సీఐ వాసుదేవరావు మాట్లాడుతూ.. మృతదేహం గుర్తుపట్టడానికి వీలులేకుండా కుళ్లిపోయిందని, మృతుడి వయస్సు సుమారు 35-40 ఏళ్లు ఉంటుందని తెలిపారు. ఎవరైనా మృతుడిని గుర్తుపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

  • గుండాల ఏజెన్సీలో భారీ వర్షం..

    భద్రాద్రి కొత్తగూడెం: గుండాల ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. ఈక్రమంలో లెవెల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. నాగారం, పాలగూడెం, కొడవటంచ గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈసందర్భంగా పలువురు ఏజెన్సీ వాసులు మాట్లాడుతూ.. వెంటనే బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు సూచించారు. అవసరం అయితే తప్పా బయటికి రావద్దని కోరారు.

  • భారీగా వరద.. నిలిచిన రాకపోకలు..

    మంచిర్యాల: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బెల్లంపల్లి పట్టణంలోని రామ్‌నగర్ బస్తి ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.  శనివారం రామ్‌నగర్ వంతెనపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో హనుమాన్ బస్తి, రామ్‌నగర్ వాసులకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి నిర్మాణంపై ఎమ్మెల్యే హామీ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం ప్రజల కష్టాలు తప్పేలా లేవు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు కీలక సూచనలు చేశారు.

  • రోడ్డు ప్రమాదంలో రైతుకు గాయాలు

    వరంగల్: పాల వ్యాను ఢీకొని రైతుకి గాయాలైన ఘటన శనివారం వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన చల్లరాజు అనే రైతు తన పొలానికి వరినారు తీసుకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన పాల వ్యాను ఢీకొనింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రైతును స్థానికులు 108లో ఎంజీఎంకు తరలించారు. ప్రమాదంలో ఒక ఎద్దు తీవ్రంగా గాయపడింది.

  • యూరియా కోసం రైతుల పడిగాపులు..

    మహబాబూబాద్: బయ్యారం మండలం కేంద్రంలో మన గ్రోమెర్ షాపు ముందు తెల్లవారుజామున నుంచే రైతలు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈక్రమంలో పలువురు రైతులు వర్షం పడుతుండటంతో క్యూలైన్‌లో నిలబడలేక చేప్పలు పెట్టారు. వారం రోజుల నుంచి తిరుగుతున్న యూరియా దొరకడం లేదంటూ రైతులు ఆందోళన చేశారు. షాపు ముందు పెద్ద సంఖ్యలో రైతులు ఎదురు చూస్తున్నారు.