ములుగు: భారీ వర్షం కారణంగా తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయిన ఘటన బండారుపల్లి – నర్సాపూర్ మధ్య రాళ్లవాగు వద్ద చోటుచేసుకుంది. బండారుపల్లి – నర్సాపూర్ మధ్య రాళ్లవాగుపై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈక్రమంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు వరద దాటికి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Author: Shivaganesh
-
కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు..
ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ఈక్రమంలో అధికారులు ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి ఇటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694 అడుగుల వద్ద కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లోగా 70 వేల క్యూసెక్కుల నీరు చేరుతున్న క్రమంలో 17 గేట్లు ఎత్తి 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
-
బెల్లంపల్లిలో కుండపోత వాన..
మంచిర్యాల: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా బెల్లంపల్లి పట్టణ, మండల పరిధిలో శనివారం భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం రాత్రంతా కురిసిన వర్షం, తెల్లవారుజాము నుంచి కుండపోతగా మారింది. ఈక్రమంలో బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరం అయితే తప్పా బయటికి రావద్దని, జాగ్రత్తలు పాటించాలని కోరారు.
-
తీజ్ ఉత్సవాలకు మంత్రికి ఆహ్వానం
సిద్దిపేట: హుస్నాబాద్ బంజారా కమిటీ సభ్యులు శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఈనెల 21న హుస్నాబాద్ కేంద్రంలోని బంజారా భవన్‌లో జరిగే తీజ్ ఉత్సవాలకు రావాలని మంత్రిని ఆహ్వానించారు. దానికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హుస్నాబాద్ బంజారా కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.
-
ఎన్జీవోస్ కాలనీ దుస్థితి.. చిన్న వానకే జలమయం
మెదక్: చేగుంట మండల కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో చిన్న వానకే రోడ్లు జలమయం అవుతున్నాయి. ఈసందర్భంగా పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ.. చిన్నవర్షాలకు కూడా రోడ్లు జలమయం కావడానికి ప్రధాన కారణం కాలనీలో సక్రమంగా డ్రైనేజీ, రహదారి సౌకర్యం లేకపోవడమే అని అంటున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
-
వాగు జోరు.. చేపల వేట షురూ.!
ఖమ్మం: కూసుమంచి మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరదల్లో చేపలు వస్తుండటంతో స్థానికులు చేపల వేటలో నిమగ్నమయ్యారు. నర్సింహులగూడెం గ్రామం వద్ద వాగులో స్థానికులు చేపల వేటకు రావడంతో పెద్ద ఎత్తున సందడి నెలకొంది. కూసుమంచి, కొత్తూరు, కిష్టాపురం వాగుల్లోనూ ఆయా గ్రామల ప్రజలు చేపలు పట్టుకున్నారు.
-
దంచికొడుతున్న వాన.. నిలిచిన రాకపోకలు
ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో దంచికొడుతున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల కోటపల్లి మండలంలోని నక్కపల్లి లోతువాగులో భారీ వరద కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో సిరికొండ మండలం చిక్‌మన్‌వాగు, ఇంద్రవెల్లి ఉట్నూరు వాగుల ఉధృతి కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయారు.
-
గంటగంటకు టెన్షన్.. సింగూరు ప్రాజెక్టుకు భారీ వరద
మెదక్: సింగూరు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. అధికారులు మరో రెండు గేట్లను ఎత్తి మొత్తం ఐదు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 24,718 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 43,176 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 21.849 టీఎంసీల నీరు ఉంది.
-
రాగి తీగలు చోరీ.. ముగ్గురు అరెస్ట్
ఆదిలాబాద్: రాగి తీగలు చోరీ చేసిన కేసులో ముగ్గురు నిందితులను శుక్రవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సై రమ్య పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పుడు అనుమానాస్పదంగా కనిపించిన మహారాష్ట్రకు చెందిన దేవీదాస్, లాండసాంగికి చెందిన రాజేశ్వర్, శివాజీలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30 కిలోల రాగితీగలను స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
-
భారీ వర్షాలు.. స్తంభించిన రాకపోకలు
మహబూబాబాద్: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొత్తగూడ మండలంలో రాకపోకలు స్తంభించాయి. గూడూరులో అత్యధికంగా 90.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. గాదేవాగు, కొత్తపల్లి వాగులు ఉప్పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాళ్లతోటే వాగు వద్ద ఆర్టీసీ బస్సు నిలిచిపోగా, పోలీసులు ప్రజలను వాగులు దాటవద్దని హెచ్చరించారు. గంగారం మండలం మడగూడెం వద్ద రోడ్డుకు అడ్డంగా చెట్టు కూలింది.