Author: Shivaganesh

  • ‘యూరియా కొరతపై వదంతులను నమ్మవద్దు’

    మెదక్: యూరియా కొరతపై వదంతులను నమ్మవద్దని రైతులకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఈసందర్భంగా ఆయన రామాయంపేటలో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపడా యూరియా వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కొంతమంది రైతులు యూరియా నిల్వ చేసుకోవడంతోనే కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించినా, అక్రమంగా నిల్వ చేసిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • జిల్లాలో ‘పనుల జాతర-2025’ ప్రారంభం కానుంది..

    మెదక్: పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ‘పనుల జాతర-2025’ కార్యక్రమం ప్రారంభం కానుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈనెల 22న అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమం ద్వారా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

  • కలెక్టర్‌ను కలిసిన ఏడీ అనిల్ కుమార్

    మెదక్: జిల్లా ఖజానా శాఖ సహాయ సంచాలకులుగా (A.D) అనిల్ కుమార్ మరాటి బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, ట్రెజరీ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహిస్తానని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ మరాటికి ట్రెజరీ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉప కోశాధికారి ఎస్.వేణుగోపాల్, జూనియర్ అకౌంటెంట్ యాదగిరి, సిబ్బంది పాల్గొన్నారు.

  • నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

    కరీంనగర్: భగత్‌నగర్ నగరంలోని పలు ప్రాంతాలకు శుక్రవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం తలెత్తుందని నగర రెండో ఏడీఈ ఎం.లావణ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సంతోష్ నగర్, భాగ్యనగర్, సెయింట్ జాన్ పాఠశాల ప్రాంతం, కొత్త లేబర్ అడ్డా, సాయిబాబా దేవాలయం, జ్యోతినగర్, గీతాభవన్ వెనుక భాగం, తదితర ప్రాంతాలకు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

  • నేడు అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

    హన్మకొండ : హన్మకొండ జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యదర్శి సారంగపాణి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం  హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అండర్-14, 16, 18, 20 బాలబాలికలకు వివిధ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న అథ్లెట్లు ఉదయం 10 గంటలకు జేఎన్ స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు.

  • ‘విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి’

    మెదక్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల ద్వారా విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమ అధికారి జగదీష్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మెదక్‌లోని బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

  • ‘ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ సమస్యలను పట్టించుకోవడం లేదు’

    మెదక్: రామాయంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో సమస్యలు పేరుకుపోయాయని యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జగన్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టల్లో సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అయినా ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తే తమను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వెంటనే సమస్యలను పరిష్కారాన్నించాలని డిమాండ్ చేశారు.

  • అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం

    భద్రాద్రి కొత్తగూడెం: దమ్మపేట మండలం అప్పారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలో రెండు కంప్యూటర్ కాంటాలు ఉన్నప్పటికీ, ఒకటే వాడటంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వాపోయారు. దీంతో తమకు ఒక రోజంతా వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

  • SRSP 16 గేట్ల ఎత్తివేత

    నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈసందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. ప్రాజెక్టులోకి 80,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, గురువారం రాత్రి 16 గేట్లు ఎత్తి 49,280 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1090.8 అడుగుల నీటిమట్టం ఉండగా, 79.658 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. మొత్తం ఔట్‌ఫ్లో 78,812 క్యూసెక్కులుగా ఉందని పేర్కొంది.

     

  • రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం

    వరంగల్: రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. గురువారం వరంగల్ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు రివర్స్ అవుతుండగా, స్టేషన్ ముందున్న ఏటీఎం పక్క గోడను ఢీకొట్టింది. ప్రమాదంలో గోడ ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.