వరంగల్: ఈనెల 17న ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా పాఠశాల సమాఖ్య (ఎస్ఎఫ్) కార్యదర్శి సారంగపాణి తెలిపారు. సుభ్రతో ముఖర్జీ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉర్సు బైపాస్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అండర్-15(బాలురు), అండర్-17 (బాలబాలికలు) లో పోటీలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు 97053 60244లో సంప్రదించాలని తెలిపారు.
Author: Shivaganesh
-
నేడు వరంగల్ తూర్పులో మంత్రి సురేఖ పర్యటన
వరంగల్: మంత్రి కొండా సురేఖ శనివారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పాతబస్తీలోని 32వ డివిజన్ బీఆర్‌నగర్, 42వ డివిజన్ రంగశాయిపేట పీహెచ్‌సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, అనంతరం 28వ డివిజన్‌లో పలు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఈసందర్భంగా కరీమాబాద్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో మంత్రి సురేఖ ప్రసంగించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
-
గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్ట్..
ఆదిలాబాద్: గంజాయి విక్రయిస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన భీంపూర్ మండల పరిధిలోని ఆర్లిటికిలో వెలుగుచూసింది. ఆర్లిటికి చెందిన మీరాబాయి గంజాయి నిల్వచేసి విక్రయిస్తోందన్న సమచారం మేరకు దాడి చేసి, అరెస్టు చేసినట్లు సీఐ సాయినాథ్, ఎస్సై పీర్సింగ్ తెలిపారు. మహిళ ఇంట్లో 228గ్రా. ఎండు గంజాయితో పాటు పెరట్లో ఒక గంజాయి మొక్క లభించినట్లు వివరించారు. ఆమెను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
-
యువతి అదృశ్యం.. కేసు నమోదు
ఆదిలాబాద్: యువతి(18) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని పంజేషా కాలనీకి చెందిన యువతి గురువారం ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఈక్రమంలో కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం వారు పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి.సునిల్ కుమార్ తెలిపారు.
-
పవర్ కట్..
ఖమ్మం: కూసుమంచి విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలోని తురకగూడెం ఫీడర్, పాలేరు వ్యవసాయ ఫీడర్ల పరిధిలో శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. తురకగూడెం ఫీడర్ పరిధిలో కూసుమంచి వ్యవసాయ బావులకు, తురకగూడెం, కిష్టాపురం గ్రామాలకు 11 గంటల వరకు, పాలేరు పరిధిలో భోజ్యాతండా, పాలేరు వ్యవసాయ లైనులో మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
-
నాగులవంచ రైల్వే స్టేషన్ కొనసాగిస్తూ ఉత్తర్వులు
ఖమ్మం: నాగులవంచ రైల్వే స్టేషన్‌ను కొనసాగిస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ సునీత ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవటంతో పాటు కనిష్ట ఆదరణను కారణంగా చూపుతూ స్టేషన్ను మూసివేస్తున్నట్లు ఇటీవల అధికారులు డ్రాఫ్ట్ నోటిఫికేషను విడుదల చేశారు. దీంతో స్థానికులు, పలు సంఘాల వారు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో అధికారులు స్టేషన్‌ను కొనసాగిస్తూ తక్షణ ఉత్తర్వులు జారీచేశారు.
-
వరద పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్
మెదక్: ఏడుపాయల పరిసర ప్రాంతాలను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి వరద పరిస్థితిని పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుందని, దీంతో ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని మూసివేసినట్లు తెలిపారు. వాతావరణం శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
-
ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత
మెదక్: ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్‌రావును కాట్రియాల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడిల నగేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయన ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాట్రాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరిందని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే సమస్యపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
-
భర్త హత్యకు భార్య కుట్ర
వరంగల్: భర్తను చంపడానికి భార్య, ఆమె ప్రియుడు యత్నించిన ఘటన మట్టెవాడలో వెలుగుచూసింది. మట్టెవాడకు చెందిన గంగరబోయిన రాజును ఆయన భార్య పద్మ, ఆమె ప్రియుడు సందీప్‌తో కలిసి హత్య చేయడానికి ప్రయత్నించారు. ఈనెల 14న సందీప్, మరోముగ్గురు వ్యక్తులు రాజును పోతననగర్ డంపింగ్‌యార్డుకు తీసుకెళ్లి దాడిచేశారు. బాధితుడి కేకలువిని స్థానికులు రావడంతో నిందితులు పారిపోయారు. కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ములుగు: వెంకటాపురం మండలంలో శుక్రవారం ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈసందర్బంగా మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయజెండాలను ఆవిష్కరించారు. తహశీల్దారు కార్యాలయంలో ఎమ్మార్వో వేణుగోపాల్, పోలీస్ స్టేషన్లో సీఐ ముత్యం రమేష్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, ఐసీడీఎస్ కార్యాలయంలో ఇన్‌ఛార్జీ సీడీపీఓ చంద్రకళ, వ్యవసాయశాఖ కార్యాలయలంలో ఏవో వేణు, తదితర అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.