ఆదిలాబాద్: జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల ప్రాణత్యాగమని గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
ఫ్రీ షుగర్ టెస్ట్ క్యాంప్…
నిర్మల్: నిర్మల్ పట్టణంలో స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థానిక మయూరి హోటల్ సమీపంలో ఫ్రీ షుగర్ టెస్ట్ క్యాంప్ నిర్వహించారు. ఈసందర్భంగా హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో దాదాపు 300 మందికి పైగా ప్రజలు పాల్గొని షుగర్ టెస్ట్ చేయించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం సొసైటీ స్థాపకుడు ఇర్షన్, సభ్యులు పాల్గొన్నారు.
-
వర్షంలోనూ దేశభక్తి చాటుకున్న చిన్నారులు..
కుమ్రంభీం: కాగజ్‌నగర్ మండలం సార్సాల గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎంపీపీఎస్ పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వర్షం రావడంతో పిల్లలు పరుగులు తీయకుండా గీతాలాపన పూర్తయ్యే వరకు వర్షంలోనే ఉండి అబ్బుర పరిచారు. చిన్ననాటి నుంచే జాతీయభావం ఉండటం అభినందనీయమని పలువురు గ్రామస్థులు విద్యార్థుల తీరును కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
-
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హన్మకొండ: పరకాల మండల ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం అని అన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
-
జిల్లా పోలీసు కార్యాలయంలో జెండా పండుగ
మహబూబాబాద్: జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారి త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
హన్మకొండ: పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యంగ బద్ధంగా పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
-
జెండా పండుగలో బోథ్ ఎమ్మెల్యే
ఆదిలాబాద్: బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాను అనుభవిస్తున్నాం అంటే దానికి కారణంగా ఎంతో మంది యోధుల ప్రాణత్యాగాలే అని అన్నారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
సారూ.. ఇందేం తీరు..!
వరంగల్: వర్ధన్నపేటలో జాతీయ బ్యాంకులైన ఎస్‌బీఐ, కెనరా బ్యాంకులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించకపోవడం చర్చనీయాంశమైంది. దేశమంతా జాతీయ జెండా ఆవిష్కరణలతో పులకించిపోతే, ఈ బ్యాంకులు విస్మరించడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వరుసగా రెండు రోజులు సెలవులు ఉండటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు భావిస్తున్నారు. ఘటనపై బ్యాంక్ సిబ్బంది స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
-
గూడూరులో జెండా పండుగ..
మహబూబాబాద్: గూడూరు మండల కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో నాగాభవాని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మండల ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువరు అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
-
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి
ములుగు: జిల్లా కేంద్రంలో తంగేడు స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్రలో ఆగస్టు 15 కు విశిష్ట స్థానం ఉందన్నారు. 2047 నాటికి భారతదేశ ముఖచిత్రం మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం ప్రజాప్రభుత్వానిదని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.