వరంగల్: వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తహసీల్దార్ విజయసాగర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
‘రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు’
మహబాబూబాద్: బయ్యారం మండలం కేంద్రంలో సొసైటీ ఛైర్మన్ మూల మధుకర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరోసారి జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డిసిసిబి), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పదవి కాలం ఆరు నెలలు పొడిగించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాలక వర్గం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
-
‘సమరయోధుల త్యాగాలు గొప్పవి’
మహబాబూబాద్: బయ్యారం మండలం కేంద్రంలోని వ్యవసాయ విస్తరణ అధికారి కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఏఈఓ మహమ్మద్ ఫయాజ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలు గొప్పవని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో రైతులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొని, దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
పారిశ్రామిక వాడలో రైతుల ఆందోళన..
సంగారెడ్డి: గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి పారిశ్రామిక వాడలో రైతులు ఆందోళన చేశారు. ఈసందర్భంగా పలువురు స్థానిక రైతులు మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న మైత్రీ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హానర్ ల్యాబ్ పరిశ్రమలు వర్షం మాటున కాలుష్య జలాలను వదలడంతో పంటలు నాశనం అవుతున్నాయని వాపోయారు. సదరు పరిశ్రమలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు స్పందించాలన్నారు.
-
‘మహానుభావులు త్యాగాల ఫలితం స్వాతంత్ర్యం’
కుమ్రం భీం: కాగజ్ నగర్ పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో, గాంధీ చౌక్ ఆవరణలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎల్పుల రాజేందర్, పలువురు నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
పొట్లపల్లిలో జెండా పండుగ
సిద్దిపేట: 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరుల త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు శీను, కన్నెశంకర్, శ్రీనివాస్, సంపత్, బాలరాజు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
-
ట్రైనీ ఎస్సై దురుసు ప్రవర్తన..
మహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో కలెక్టరేట్ బయట విధులు నిర్వర్తిస్తున్న ట్రైనీ ఎస్సై నరేశ్ దురుసు ప్రవర్తనపై కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చే ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు, జర్నలిస్టులతో ఆయన అమర్యాదగా మాట్లాడటం చూసి తప్పుబట్టారు. ఇలాంటి వారితో పోలీస్ వ్యవస్థకు మచ్చ ఏర్పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
-
నర్సాపూర్‌లో ఘనంగా జెండా పండుగ
మెదక్: నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
-
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే
సంగారెడ్డి: సంగారెడ్డిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల కేసీఆర్ సుపరిపాలనలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.