Author: Shivaganesh

  • జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్

    సంగారెడ్డి: కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో అదనపు కలెక్టర్ల చంద్రశేఖర్, మాధురిలతో కలసి కలెక్టర్ పి.ప్రావీణ్య హాజరై ఆవిష్కరించారు. అంతకుముందు కలెక్టరేట్లోని అమరవీరుల స్తూపానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అమరులను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • గుమ్మడిదలలో జెండా పండుగ..

    సంగారెడ్డి: గుమ్మడిదల మండల కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో  మండల ప్రత్యేక అధికారి అఖిలేష్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరుల త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు విజయభాస్కర్ రెడ్డి, కుమార్ గౌడ్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

     

  • నల్ల పోచమ్మకు ప్రత్యేక పూజలు

    మెదక్: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వెలిసిన నల్ల పోచమ్మ దేవాలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా పురోహితులు శివ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారికి విశేష అలంకరణ, కుంకుమార్చన పూజలు చేసినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ ఈవో రంగారావు పర్యవేక్షించారు.

     

  • జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

    సంగారెడ్డి: జహీరాబాద్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారిని గుర్తు చేసుకున్నారు. రెవెన్యూ సబ్ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో రామిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • ‘మహానుభావుల పోరాట ఫలితం స్వాతంత్ర్యం’

    ఖమ్మం: నేలకొండపల్లిలో భక్త రామదాసు సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సొసైటీ అధ్యక్షుడు ఏటుకూరి వెంకట రామారావు జెండా ఎగురావేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల పోరాట ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించ్చిందన్నారు. వారి స్పూర్తితో అందరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • సదాశివపేటలో జెండా పండుగ

    సంగారెడ్డి: సదాశివపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సీఐ వెంకటేష్ జాతీయ జండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  ఎంతో మంది స్వాతంత్ర్య యోధుల పోరాటల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు, ఏఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

  • సీఎం చిత్రపటానికి పాలాభిషేకం..

    వరంగల్: తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) పాలకవర్గాల పదవీకాలాన్ని ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించింది. ప్రభుత్వ నిర్ణయంపై వర్ధన్నపేట పీఏసీఎస్ ఛైర్మన్ కౌడగాని రాజేష్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ఎల్లప్పుడు సేవలు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

  • కాగజ్‌నగర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

    కుమ్రం భీం: కాగజ్‌నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో  మున్సిపల్ కమిషనర్ ఎల్పులే రాజేందర్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. వారి త్యాగాలను, పోరాటాలను మరువలేవన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • 2k రన్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే

    సంగారెడ్డి: పటాన్‌చెరులో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొల్యూషన్ ఫ్రీ పటాన్‌చెరు 2k రన్‌ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 2కె రన్ పేరుతో ఒకే రోజు హంగామా చేసి ఫోటోలు దిగి ప్రచారం చేసుకోవడం కాకుండా, ప్రతి రోజూ ఉదయం రన్నింగ్ చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.

  • వర్ధన్నపేట పీఏసీఎస్‌లో జెండా పండుగ

    వరంగల్: వర్ధన్నపేట పీఏసీఎస్ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పీఏసీఎస్ కార్యాలయంలో ఛైర్మన్ కౌడగాని రాజేష్ కన్నా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో CEO వెంకటయ్య, PACS డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.