Author: Shivaganesh

  • జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఐ

    ఖమ్మం: మధిర పోలీస్ సర్కిల్ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ మధు  జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా భద్రత, శాంతి పరిరక్షణలో మరింత కృషి చేయాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

  • జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

    సంగారెడ్డి: నారాయణఖేడ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంరతం ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకున్నారు. దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. వేడుకల్లో స్థానిక అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

  • నార్నూర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

    ఆదిలాబాద్: నార్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డా.అంబేడ్కర్, మహాత్మ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వేచ్ఛ కోసం బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోదుల కృషిని కోనియాడారు.

  • పోచమ్మతల్లికి మాజీ ఎమ్మెల్యే పూజలు

    జనగామ: జఫర్‌గఢ్ మండలం కునూరు గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఆయన ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

     

  • జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపీ

    సంగారెడ్డి: నారాయణఖేడ్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ శెట్కర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం దేశ ప్రజలు చేసిన పోరాటాలను కోనియాడారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

  • 17న ఆయుర్వేద వైద్య శిబిరం

    మంచిర్యాల: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మందమర్రి సీఈఆర్ క్లబ్లో ఆదివారం ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపింది. 17న తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు హైదరాబాద్‌కు చెందిన మాతా రీసెర్చ్ సెంటర్ వైద్యులు విశ్వనాథ మహర్షి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  • 16న వాలీబాల్ ఎంపిక పోటీలు

    మంచిర్యాల: ఈనెల 16న అండర్-15 బాల, బాలికల జిల్లాస్థాయి వాలీబాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లుగా ఎసీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండీ యాకూబ్ తెలిపారు. జన్నారం మండలంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో పోటీలు ఉంటాయన్నారు. ఎంపికైన విద్యార్థులు 18, 19వ తేదీలలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్ర హీంపట్నంలో రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు.

     

  • జిల్లా టాపర్స్‌కు ఫ్రైజ్ మనీ..

    వరంగల్: పదో తరగతి, ఇంటర్లో జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ కానుకను ప్రకటించింది.  ఇటీవల విడుదల చేసిన పది ఫలితాల్లో జిల్లా టాపర్లుగా నిలిచిన నలుగురు, ఇంటర్లో టాపర్లుగా నిలిచిన నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు, ప్రశంసాపత్రాలను శుక్రవారం స్వాతంత్య్ర వేడుకల్లో అతిథులచే అందించనున్నారు.

  • కారు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

    మెదక్: కారు బోల్తాపడి ఇద్దరికి గాయాలైన ఘటన అల్లాదుర్గం మండల పరిధి రాంపూర్ గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న కారు గ్రామ శివారుకు రాగానే ఆకోలా- హైదరాబాద్-161 జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో అబ్బాస్, ఇమ్రాన్‌‌లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

     

  • నిండుకుండలా బేతుపల్లి పెద్దచెరువు..

    ఖమ్మం: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి పెద్దచెరువు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లోని చిన్నచెరువులు, వాగులు పొంగిపోర్లడంతో పెద్దచెరువులోకి భారీగా వరదనీరు చేరింది. ఈక్రమంలో పెద్దచెరువు అలుగు పారుతుంది. నీటితో నిండిన చెరువును చూసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రబీ సీజన్‌లో పంటలకు తగినంత నీరు లభిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.