Author: Shivaganesh

  • అత్యాచారయత్నం కేసులో ఐదేళ్ల జైలు

    సంగారెడ్డి: అత్యాచారానికి యత్నించిన వ్యక్తికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేలజరిమానా విధిస్తూ జిల్లా పోక్సో ప్రత్యేక జడ్జి జయంతి తీర్పు వెలువరించారు. జహీరాబాద్ మండలంలోని ఓతండాలో 2020 జులై 7న ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అదేతండాకు చెందిన రాథోడ్‌సంజీవ్ అత్యాచారానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించి కేకలువేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు విచారణలో తుదితీర్పు వెల్లడించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

  • కరెంట్ షాక్‌తో కూలీ మృతి

    వరంగల్: కరెంట్ షాక్‌తో కూలీ మృతి చెందిన ఘటన ఖిలావరంగల్ మండలం నక్కలపల్లిలో చోటుచేసుకుంది. మార్కండేయనగర్‌కు చెందిన జాటోతు నాగేశ్వర్‌రావు (41) నక్కలపల్లి రైస్ మిల్లులో కూలీ. ఈక్రమంలో పనికి వెళ్లిన ఆయన ఇనుప చువ్వను పట్టుకోగా.. కరెంట్ షాక్‌తో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.

  • నేడు ఎర్రుపాలెంలో డిప్యూటీ సీఎం పర్యటన

    ఖమ్మం: ఎర్రుపాలెం మండలంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గురువారం పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి తెలిపారు. ఎస్సీ ఉపప్రణాళిక నిధులు రూ.4 కోట్లతో ఎర్రుపాలెం, పెద్దగోపవరం, బనిగండ్లపాడు, బుచ్చిరెడ్డిపాలెం, అయ్యవారిగూడెం గ్రామాల్లో నిర్మించనున్న సిమెంట్ రహదారులకు ఆయన శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొనాలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

  • 15న జెండావిష్కరణ.. రెండు జిల్లాలకు ఇద్దరు మంత్రులు

    ఖమ్మం: ఖమ్మంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో చీఫ్ గెస్ట్‌గా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్ర మార్క పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సువర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. జిల్లాల వారీగా జెండా ఆవిష్కరించే వారి వివరాలను తెలుపుతూ ప్రభుత్వం బుధవారం జీఓ జారీ చేసింది.

  • ప్రవేశాల గడువు పొడిగింపు..

    సిద్దిపేట: డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలోని సిద్దిపేట ప్రాంతీయ అభ్యాసకుల సహాయ కేంద్రంలో 2025-26 ప్రవేశాల గడువును పొడిగించినట్లు సమన్వయకర్త డా.శ్రద్ధానందం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 20వ తేదీలోపు ఆన్‌లైన్లో దరఖాస్తులను సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు 7382929615 నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

  • నేడు జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపిక పోటీలు

    మెదక్: మెదక్ పట్టణంలోని గుల్షన్ క్లబ్లో గురువారం ఉదయం 9 గంటల నుంచి జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలో పాల్గొనడానికి 15 ఏళ్ల లోపు బాలబాలికలు అర్హులన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 8 మంది బాలురు, 8 మంది బాలికలతో కూడిన జిల్లా జట్టును ఎంపిక చేస్తామన్నారు. పూర్తివివరాలకు 8985536704, 9985111011 నంబర్‌లను సంప్రదించాలన్నారు.

  • రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..

    ఆదిలాబాద్: ఎదులాపురం, ఆదిలాబాద్ – హుజూర్‌బాహెబ్, నాందేడ్ – ఆదిలాబాద్ ఎక్స్ ప్రెస్ రైలు (నెంబర్లు 17409, 17410)కు అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం నుంచి అదనపు బోగిలు అమల్లోకి రానున్నట్లు నాందేడ్ డివిజన్ పీఆర్వో రాజేశ్‌షిండే పేర్కొన్నారు. ఈ మార్పుతో ఆ రైళ్లలో మొత్తం 15 కోచ్‌లు అవుతాయి. ఈనెల 20 వరకు అదనపు బోగీలు అందుబాటులో ఉంటాయన్నారు.

     

  • బల్దియాలో సహాయ కేంద్రం ఏర్పాటు

    ఆదిలాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు బల్దియాలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కమిషనర్ సీవీఎన్ రాజు తెలిపారు. పట్టణంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముంపు సమస్యలు ఎదురైతే 9492164153 నెంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. వెంటనే సిబ్బంది స్పందించి సహాయక చర్యలు చేపడతారని వెల్లడించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

  • అలర్ట్.. ప్రవేశాల గడువు పొడిగింపు

    వరంగల్: మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 27 వరకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ అవకశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

  • జిల్లాకు చీఫ్ గెస్ట్‌గా మంత్రి పొంగులేటి

    వరంగల్: జిల్లా కేంద్రంలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రానున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 15న ఉదయం 9.30 గంటలకు మంత్రి పొంగులేటి జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారని వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.