Author: Shivaganesh

  • వాగును పరిశీలించిన ఎమ్మెల్యే..

    వరంగల్: సంగెం మండలం పరిధిలోని కాట్రపల్లి, వెంకటాపూర్ గ్రామాల మధ్య ఉన్న వాగును బుధవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటువైపు ప్రజలు, వాహనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

  • రోడ్డు మరమ్మతులు చేపట్టాలని నిరసన

    మంచిర్యాల: బెల్లంపల్లి పట్టణంలో బుధవారం సింగరేణి జేఏసీ నాయకులు నిరసన తెలిపారు.ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి కన్నాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికారులు తాత్కాలిక పరిష్కారలు చేస్తూ, శాశ్వత పరిష్కారం చేయడం లేదని విమర్శించారు. ఉన్నతాధికారులు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్నారు.

  • ‘చెరువుల వద్దకు వెళ్లకూడదు’

    సంగారెడ్డి: కొండాపూర్ మండలంలోని వాగులు ,కుంటాలను ఎస్సై సోమేశ్వరి సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు భారీ వర్షాల నేపథ్యంలో పలు జాగ్రత్తలు, సూచనలు చేశారు. చెరువులు, కుంటల వద్దకు వెళ్లకూడదని, పిల్లలను తల్లిదండ్రులు వాగులు వద్దకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే 100కు లేదా 87126 56748 కు డయల్ చేయాలని తెలిపారు.

  • ‘ప్రతి ఇంట్లో జాతీయ జెండా ఎగురవేయాలి’

    సిద్దిపేట: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంట్లో జాతీయ జెండా ఎగురవేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేటలో నిర్వహించిన ‘తిరంగా ర్యాలీ’లో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీలు, కుల, మతాలకు అతీతంగా విద్యార్థులకు జాతీయ జెండా ఆవశ్యకతను, దేశ చరిత్రను తెలియజేయడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

  • విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

    ఆదిలాబాద్: ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం ఉదయం ప్రిన్సిపాల్ డాక్టర్ అతిక్ బేగం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు విద్యార్థులతో మత్తు, గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. చెడు అలవాట్లకు బానిస కాకుండా, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆంటీ డ్రగ్ కోఆర్డినేటర్ డాక్టర్ కోటయ్య, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • ‘యువత స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకొవాలి’

    మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలో బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన అన్నపూర్ణ హోటల్‌ను కొత్తగూడ ఎస్సై రాజ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకొని అభివృద్ధి వైపుకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈక్రమంలో జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను ఓర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హోటల్ యజమాని, పలువురు స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

  • ప్రజలకు ఎస్సై సూచనలు..

    సంగారెడ్డి: మునిపల్లి మండలంలోని వాగులు, కుంటాలను బుధవారం ఎస్సై రాజేష్ నాయక్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువులు, కుంటల వద్దకు వెళ్లకూడదని, పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తలు చూసుకోవాలని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే 100కు లేదా 87126 56749 కు డయల్ చేయాలని సూచించారు.

  • హుస్నాబాద్‌లో ఇంటింటికి మొక్కల పంపిణీ

    సిద్దిపేట: హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ టి.మల్లికార్జున్ ఆదేశాలతో పట్టణంలోని 1, 10వ వార్డుల్లో బుధవారం వనమహోత్సవ కార్యక్రమంలో  ఇంటింటికి పూలు, పండ్ల మొక్కల పంపిణీ చేశారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. కచ్చితంగా ప్రజలు పంపిణీ చేసిన మొక్కలను నాటాలని సూచించారు. కార్యక్రమంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, వనమహొత్సవ సూపర్వైజర్ శ్రీధర్,  మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

  • నర్సాపూర్‌లో సాగు న్యాయ యాత్ర

    మెదక్: నర్సాపూర్ రైతు వేదికలో బుధవారం లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో సాగు న్యాయ యాత్రలో భాగంగా ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  ఈసందర్భంగా రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ మాట్లాడుతూ.. రైతులను భూ చట్టాలు, భూమి సమస్యలు, పంట రుణాలు, పంటల బీమా వంటి ఆరు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలి’

    మెదక్: నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో ఓ ప్రైవేట్ పాఠశాల ఆధ్వర్యంలో మద్యపానం, గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎస్సై రాజేష్ మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.