Author: Shivaganesh

  • రోడ్డుపై నాట్లు వేసి.. నిరసన

    మహబాబూబాద్: నాట్లు వేసి గ్రామస్థులు నిరసన తెలిపిన ఘటన బుధవారం బయ్యారం మండల కేంద్రంలోని రుద్రమదేవి కాలనీలో చోటుచేసుకుది. ఈసందర్భంగా పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ.. రోడ్డు మొత్తం అధ్వానంగా తయారు అయ్యిందని, దీనిని పట్టించుకునే వాళ్లు లేరని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.

  • విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

    ములుగు: వాజేడు మండల పరిధిలోని పేరూరు ఆశ్రమ పాఠశాలలో చదువులతల్లి సరస్వతిదేవి విగ్రహాన్ని బుధవారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొడ్డే నాగేశ్వరరావు జ్ఞాపకార్థంగా ఆయన కుమారుడు శరత్ అమ్మవారి విగ్రహాన్ని విరాళంగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శరత్‌ను అభినందించారు. విద్యార్థులు మంచిగా చదువుకోవాలని సూచించారు.

  • ఘనంగా తిరంగా ర్యాలీ

    ములుగు: జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జాతీయ ప్రధాన రహదారిపై భారీ జాతీయ జెండాతో స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బలరాం, భాస్కర్ రెడ్డి, జవహర్, కొత్త సురేందర్, రాయంచు నాగరాజు, నగరపు రమేష్, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

  • ‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

    సంగారెడ్డి: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సదాశివపేట సీఐ వెంకటేష్ సూచించారు. ఆయన బుధవారం సదాశివపేట పట్టణ, మండలంలోని పలు వాగులు, కుంటలను సందర్శించి మాట్లాడారు. ప్రజలందరూ చెరువులు, కుంటల వద్దకు వెళ్లవద్దని, విద్యుత్తు స్తంభాలు, వైర్లను తాకవద్దని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు.

  • నర్సాపూర్‌లో బీజేపీ తిరంగ ర్యాలీ..

    మెదక్: నర్సాపూర్‌లో బుధవారం 330 అడుగుల జాతీయ పతాకంతో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ  నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎస్బిఐ బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాధా వాలదాస్ మల్లేష్ గౌడ్, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు పాపగా రమేష్ గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రైవేటు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

     

  • ముత్తాపూర్‌‌ను ముంచెత్తిన వరద..

    మంచిర్యాల: కన్నెపల్లి మండలం ముత్తాపూర్‌ గ్రామం మంగళవారం రాత్రి కురిసిన భారీవర్షంతో వరద ముంపుకు గురైంది. మెయిన్‌ రోడ్డే చెరువులా మారి, కొన్ని ఇళ్లలోకి నీరుచేరి గోడలు దెబ్బతిన్నాయి. ఊరంతా నీటమునిగి, రహదారులు, వీధులు జలమయమయ్యాయి. సరైన డ్రైనేజీ లేక వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ.. శాశ్వత డ్రైనేజీ నిర్మాణం చేపట్టి, వరద ముప్పు నుంచి బయటపడేయాలని కోరారు.

  • మిర్జాపల్లి రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

    మెదక్: శంకరంపేట మండలలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చిన్నశంకరంపేట ఎస్సై నారాయణ అన్నారు. శంకరంపేట మండల కేంద్రంలోని మిర్జాపల్లి రైల్వే స్టేషన్‌ను బాంబు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీ చేేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేసిన, విక్రయించిన, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • ‘అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దు’

    సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలో రానున్న 72 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వినయ్ కుమార్ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, వాగులు, వంకలు, చెరువుల దగ్గరకు వెళ్లకూడదని ప్రజలకు సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని లేదా స్థానిక పోలీస్ స్టేషన్ సంప్రదించాలని తెలిపారు.

  • పెద్దవాగు ఉగ్రరూపం.. రాకపోకలు బంద్

    జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో గత రాత్రి కురిసిన వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహాముత్తారం మండలంలో భారీ వర్షానికి  పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అలుగు పారుతుందడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోణంపేట చెరువు అలుగుపటడంతో వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి.

  • మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద

    జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,11,685 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీలోని మొత్తం 85 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. బ్యారేజీ వద్ద పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.