సిద్దిపేట: పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ చౌరస్తా మెయిన్ రోడ్‌లో భారీ గుంత ఏర్పడింది. రోజులు గడుస్తున్న అధికారులు ఇటువైపు చూసిన దాఖలాలు లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడతూ.. భారీ గుంత కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని కోరారు.
Author: Shivaganesh
-
భరోసా సెంటర్‌ను సందర్శించిన ఎస్పీ
మెదక్: మెదక్ పట్టణంలోని భరోసా కేంద్రాన్ని ఏఎస్పీ మహేందర్‌తో కలిసి ఎస్పీ శ్రీనివాసరావు సందర్శించారు. ఈసందర్భంగా ఆయన లైంగిక, దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్లో కల్పించే న్యాయ సలహాలు, సైకాలజికల్ కౌన్సిలింగ్, వైద్యపరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల కేసులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలకు భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
-
గడ్డివాముకు నిప్పు.. మూగజీవాలు మృతి
మెదక్: గడ్డివాముకు నిప్పంటుకుని మూగజీవాలు మృతి చెందిన ఘటన శివంపేట మండలం బొజ్జా తండాలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బానోతు లక్ష్మణ్‌కు చెందిన పశువులపాక గడ్డివాముకు నిప్పంటుకొని రెండు గేదెలు, ఏడు దూడలు అక్కడికక్కడే మృతి చెందాయి. గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. ఈసందర్భంగా బాధిత రైతు లక్ష్మణ్ మాట్లాడుతూ.. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటిపర్యంతం అయ్యారు.
-
14న మెగా కంటి వైద్య శిబిరం
హన్మకొండ: ఈటల నిశాంత్ మెమోరియర్ ట్రస్ట్, కమలాపూర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కమలాపూర్ మండల కేంద్రంలో ఈనెల 14న మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్వాహకులు ఈటల సమ్మయ్య మాట్లాడుతూ.. మెడ్‌విజన్ హైదరాబాద్, మల్లికార్జున కంటి హస్పిటల్ వరంగల్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కమ్యూనిటీహాల్ దగ్గర ఉదయం 9 గంటలకు శిబిరం ప్రారంభం అవుతుందన్నారు. ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
-
వాగును తలపిస్తున్న రోడ్డు..
మంచిర్యాల: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాబు క్యాంప్ పద్మశాలి భవన్ ముందు రోడ్డు చిన్నపాటి వాగును తలపిస్తుంది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వరద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈక్రమంలో రోడ్డుపై నుంచి ప్రయాణించడానికి వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
-
ఈనెల 25న వర్ధన్నపేటలో జనహిత పాదయాత్ర
వరంగల్: ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రెండవ విడత పాదయాత్ర ఈనెల 25న వర్ధన్నపేట నియోజకవర్గంలో నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జనహిత పాదయాత్రతో ఈనెల 25 సాయంత్రం 5 గంటలకు నియోజకవర్గంలోకి చేరుకుంటారని, 26న ఉదయం 7 నుంచి 10 గంటల వరకు శ్రమదానం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం 10: 30కు వరంగల్ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమ్మేళనం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
-
పాఠశాలను సందర్శించిన కలెక్టర్
మెదక్: నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా ఆయన విద్యార్థులకు అందజేస్తున్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. విద్యార్థులందరూ మంచిగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించారు.
-
‘రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి’
సంగారెడ్డి: న్యాల్కల్ మండల ప్రజలు రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సుజిత్ కుమార్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు పొంగే అవకాశం ఉందని, ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను సూచించారు.
-
రామాయంపేట పీఎసీఎస్‌లో కొత్త సేవలు..
మెదక్: రామాయంపేట మండలంలో రైతుల కోసం పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొత్తసేవలు అందుబాటులోకి తెచ్చింది. పీఏసీఎస్ అధికారులు మాట్లాడుతూ.. డ్రోన్‌తో మందుల పిచికారీ విధానాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. డ్రోన్‌తో ఎకరాకు మందు పిచికారీ చేయిస్తే కేవలం రూ. 300 ఖర్చు అవుతుందని, దీంతో రైతుల సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. ఈవిధానంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మందులు పిచికారీ చేయవచ్చని పేర్కొన్నారు.
-
‘సౌర విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయాలి’
మెదక్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గురుకులాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆయన కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. మూడు రోజుల్లో నివేదికలు సమర్పించాలని, ప్రతి కార్యాలయానికి అవసరమైన స్థలం, నెలవారీ విద్యుత్తు వినియోగం వంటి వివరాలను నివేదికలో పొందుపరచాలని సూచించారు. సమావేశంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.