Author: Shivaganesh

  • ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: సీపీ

    సిద్దిపేట: జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సీపీ బి.అనురాధ సూచించారు. జిల్లాలో రాబోయే రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఏదైనా ఇబ్బందులు ఎదురైతే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100కి కాల్ చేయాలని కోరారు. వరదలు, వాగుల ఉధృతిని పర్యవేక్షించి, పాత ఇళ్లలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశించారు.

  • పురుగుల మందుతాగి మహిళ ఆత్మహత్య..

    భద్రాద్రి కొత్తగూడెం: పురుగుల మందుతాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం అన్నపురెడ్డిపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని పెంట్లం గ్రామానికి చెందిన చింతల అప్పమ్మ(49) కొంతకాలంగా అనార్యోగంతో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఆమె పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

  • వివాహితపై వేధింపులు.. యువకుడిపై కేసు

    ఆదిలాబాద్: వివాహిత(21)ను వేధిస్తున్న దాసరి శేఖర్ (24)పై కేసునమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. గుడిహత్నూరు మండలం గోండు హర్కాపూర్‌కు చెందిన శేఖర్ ఇంద్రవెల్లి మండలంలోని ఓగ్రామానికి చెందిన వివాహితను చరవాణిలో వేధిస్తున్నారు. ఆమె గ్రామానికి సైతం వెళ్లి తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని, లేదంటే తనవద్ద వీడియోలు, ఫొటోలను సామాజికమాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు తెలిపారు.

  • ప్రజలకు కీలక సూచనలు: ఎమ్మెల్యే

    జనగామ: స్టేషన్ ఘన్‌పూర్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలన్నారు. 24/7 కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని తెలిపారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే 9052308621కి కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ప్రజలందరూ అధికారులకు సహకరించాలని అన్నారు.

  • నేడు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు

    సిద్దిపేట: ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వాలీబాల్ అండర్- 15 జిల్లా స్థాయి ఎంపికలు సిద్దిపేటలోని క్రీడా మైదానంలో నేడు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ కార్యదర్శి సౌందర్య తెలిపారు. పోటీలకు 01.01.2010 తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా ఎంపికలు ఉంటాయని, బుధవారం ఉదయం 10.30 గంటలకు పోటీలు ప్రారంభిస్తామన్నారని పేర్కొన్నారు.

  • గంజాయి సీజ్.. ముగ్గురు అరెస్ట్

    ఖమ్మం: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తితో పాటు కొనుగోలు చేస్తున్న ఇద్దరిని ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. డాబాల బజార్‌కు చెందిన విక్రయదారుడు జగదీశ్, కొనుగోలు చేసిన దిలీప్ రాజా, దీపక్‌ను మంగళవారం మూడో పట్టణ ఠాణా పోలీసులు అరెస్ చేసి, నిందితుల నుంచి 70గ్రా. గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

  • వరంగల్ మార్కెట్‌కు మూడురోజులు సెలవులు

    వరంగల్: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడురోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి జి.రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15న స్వాతంత్య్ర  దినోత్సవం, 16న శ్రీకృష్ణాష్టమి పండగ, 17న ఆదివారం వారాంతపు సెలవు కారణంగా మార్కెట్ బంద్‌లో ఉంటుందన్నారు. రైతులు గమనించి సెలవుల్లో మార్కెట్‌కు పంట ఉత్పత్తులు తీసుకురావద్దన్నారు.

  • కొత్తూరులో చోరీ కలకలం.. కేసు నమోదు

    ఆదిలాబాద్: తలమడుగు మండలంలోని కొత్తూరు గ్రామంలో చోరీ ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన బూరుగు స్వామి ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి, బీరువాను ధ్వంసం చేసి రూ. 25 వేలు చోరీ చేసినట్లు బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాధిక తెలిపారు.

  • మిస్ ఫైర్.. తప్పిన పెను ప్రమాదం

    సంగారెడ్డి: జోగిపేట సీఐ అనీల్ కుమార్ మంగళవారం తన కార్యాలయంలో పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా పేలడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. పిస్టల్ నుంచి వెళ్లిన బుల్లెట్ గోడకు తాకి టైల్స్ పగిలాయి. అనుకోకుండా పిస్టల్ ట్రిగ్గర్‌పై చెయ్యి పడటంతో పేలినట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా పెద్దగా శబ్దం రావడంతో కార్యాలయంలో ఉన్న వారందరూ బయటకు పరుగులు తీశారు.

  • గంటలో ఇద్దరు చైన్ స్నాచర్స్ అరెస్ట్.. 

    మహబూబాబాద్: ఇద్దరు చైన్ స్నాచర్లను పోలీసులు గంట వ్యవధిలోనే పట్టుకున్నారు. నిందితుల వివరాలను ఎస్పీ సుదీర్ రామ్‌నాథ్ కెకన్ వెల్లడించారు. తోర్రూరు మండలం మాటేడులో మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును అపహరించిన ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్టు చేశామన్నారు. నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికాస్‌కుమార్, శుభంకుమార్‌లుగా గుర్తించి, వారి నుంచి బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.