Author: Shivaganesh

  • ‘ఆదివాసీ సంప్రదాయాలను కాపాడుకోవడం అందరి బాధ్యత’

    ఆదిలాబాద్: ఉట్నూర్ మండలం సాకేర(బి)లో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పూర్వీకులు అందించిన ఆదివాసీ సంప్రదాయాలను కాపాడుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆదివాసీలు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం అత్యంత అవసరమని సూచించారు. కార్యక్రమంలో లచ్చు, లింగు, తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు.

  • దారుణం.. వరద నీటితో వృద్ధురాలి మృతి

    వరంగల్:  భారీ వర్షం కారణంగా విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి కాశికుంటలోని ఓ ఇంట్లోకి నీరు చేరడంతో, కింద నిద్రపోతున్న వృద్ధురాలు పసునూరి బుచ్చమ్మ (80) నీటిలో మునిగి అక్కడికక్కడే మరణించారు. ఘటనపై మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

  • షైన్ వెల్ఫేర్ సొసైటీ ఆర్థిక సాయం..

    కుమ్రంభీం: సిర్పూర్ టి మండల కేంద్రంలోని డౌనల్ ఏరియాలో నివసించే లేట్ కలాం భార్యకు ఎడమ చేయి, ఎడమ కాలికి పక్షవాతం వచ్చింది. ఈక్రమంలో ఆమెకు చికిత్స నిమిత్తం షైన్ వెల్ఫేర్ సొసైటీ సిర్పూర్ టి సభ్యులు మంగళవారం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. తమ సంస్థ కులమత భేదం లేకుండా మానవత్వం కోసం పనిచేస్తుందని తెలిపారు.

  • ఘనంగా ఏఐఎస్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకలు

    సిద్దిపేట: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం సిద్దిపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో AISF జిల్లా సమితి నాయకులు పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం నాయకులు స్వీట్లు పంపిణీ చేసి, సంబరాలు చేశారు. ఈసందర్భంగా పలువురు సంఘం నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థి ఉద్యమాల రథసారథి, దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్ అని కొనియాడారు.

  • పిల్లికోటలో కార్డెన్ సెర్చ్..

    మెదక్: పిల్లికోట డబుల్ బెడ్ రూమ్ కాలనీలో మంగళవారం డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.  ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. తనిఖీలో మొత్తం 13 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

  • పోగొట్టుకున్న ఫోన్ అప్పగింత..

    కుమ్రంభీం: కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన వాడై శ్రీనివాస్ పోగొట్టుకున్న ఫోన్‌ను పోలీసులు రికవరీ చేసి తిరిగి అతడికి అప్పగించారు. ఇటీవల ఫోన్ పోగోట్టుకున్న శ్రీనివాస్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి పోయిన మొబైల్‌ను గుర్తించి అందజేశారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్సై సుధాకర్  సూచించారు.

  • నిరసన తెలిపిన గిరిజన రైతులు..

    మహబాబూబాద్: బయ్యారం మండలం గంధంపల్లి, కొత్తపేట గిరిజన రైతులు తమకు బ్యాంక్ లోన్లు ఇవ్వాలంటూ పంట పొలాలు దగ్గర మంగళవారం నిరసన తెలిపారు. ఈసందర్భంగా గిరిజన రైతు వీరభద్రం మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో తమకు లోన్లు మంజారు చేయలేదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ తమకు లోన్‌లు ఇప్పించాలని కోరారు. నిరసనలో గిరిజన రైతులు వీరభద్రం, రాములు, తదితరులు పాల్గొన్నారు.

  • డీసీఎంను ఢీకొన్న బైక్.. ఒకరికి తీవ్రగాయాలు..

    సంగారెడ్డి: ఆగి ఉన్న డీసీఎంను ఓ బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం జహీరాబాద్ పరిధిలో వెలుగుచూసింది.  పస్తాపూర్ చౌరస్తా ఫ్లైఓవర్‌పైన ఆగి ఉన్న లారీని ఓబైక్ ఢీకొనింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న ఎమ్మెల్సీ డాక్టర్ సి.అంజిరెడ్డి క్షతగాత్రుడిని గమనించి, తన వాహనాన్ని ఆపి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • ప్రకృతి సోయగం.. కనువిందు చేస్తున్న జలపాతం

    మహబూబాబాద్: గూడూరు మండలం కొమ్ములవంచ అటవీ ప్రాంతంలో ఉన్న ప్రకృతి సహజ సిద్ధమైన భీమిని పాదం జలపాతం సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తుంది. జలపాతం సుందర దృశ్యాన్ని వీక్షించడానికి హైదరాబాద్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యటనలు వస్తున్నారు. జలపాతం వద్ద రక్షణ ఏర్పాట్లను పోలీసు, అటవీశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

  • దొంగల హల్‌చల్.. ఆందోళనలో జనాలు

    సంగారెడ్డి: గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం ప్రకృతివనం కాలనీలో దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. సోమవారంరాత్రి కాలనీలోని 3 ఇండ్లలో తాళాలు ధ్వంసం చేసి చోరీకి యత్నించారు. రెండు రోజుల క్రితం కూడా ఓఇంట్లో దొంగతనానికి ప్రయత్నించినట్లు సమాచారం. వరుసగా చోరీలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రాథమిక దర్యాప్తు మేరకు దొంగలు చోరీకి విఫలయత్నం చేశారని, కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మీకాంత్‌రెడ్డి తెలిపారు.