కుమ్రంభీం: రోడ్డుపై పంది అడ్డురావడంతో బైక్ బోల్తాపడి ఒకరికి తీవ్రగాయాలైన ఘటన మంగళవారం కాగజ్‌నగర్ మండలంలో వెలుగుచూసింది. కౌటాల మండలానికి చెందిన పార్ట్ టైం టీచర్ ధనరాజ్ తన బైక్‌పై వెళ్తుండగా కోసి గ్రామ సమీపంలో పంది అడ్డు రావడంతో బైక్ బోల్తాపడింది. ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. కుటుంబ సభ్యులను సంప్రదించగా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
Author: Shivaganesh
-
ప్రసన్నాంజనేయుడికి ప్రత్యేక పూజలు
మెదక్: నర్సాపూర్ పట్టణంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ.. స్వామివారికి సింధూర లేపనం ప్రత్యేక అలంకరణ మంగళారతి నిర్వహించినట్లు తెలిపారు. నవగ్రహ పూజ, గణపతి పూజ, శివాభిషేకం చేసినట్లు తెలిపారు. సాయంత్రం భజన కార్యక్రమాలు ఉంటాయని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
-
రామాయంపేటలో ముందుస్తు అరెస్ట్..
మెదక్: బీజేపీ, విశ్వహిందూ పరిషత్ ‘ చలో గాంధీ భవన్’ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రామాయంపేటలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం విశ్వహిందూ పరిషత్, బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. విశ్వహిందూ పరిషత్ నాయకుడు మల్లేశంతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ముందస్తు అరెస్టులను నాయకులు తీవ్రంగా ఖండించారు.
-
ఎంపీకి భద్రత పెంచాలని వినతి
మెదక్: జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నక్సలైట్ల పేరుతో గత మూడు నెలలుగా ఎంపీ మాధవినేని రఘునందన్ రావుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, స్థానిక ఎన్నికల ప్రచారాల దృష్ట్యా ఆయనకు భద్రత పెంచాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
విద్యాశాఖ కీలక నిర్ణయం: డీఈఓ
మెదక్: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సు కోసం కీలక నిర్ణయం తీసుకుందని DEO రాధా కిషన్ తెలిపారు. 2025 -26 విద్యా సంవత్సరం నుంచి SSC పబ్లిక్ పరీక్షల్లో 20% ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్‌కు 80% మార్కులు కేటాయించినట్లు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితరాణి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. తాజా వెలువడిన నిర్ణయంతో ఇప్పటి వరకు విద్యార్థల్లో నెలకొన్న ఆందోళన తీరినట్లు అయ్యింది.
-
‘ఎక్కువ లాభాలను సంపాదించవచ్చు’
మెదక్: ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను సంపాదించ వచ్చని వ్యవసాయ అధికారులు తెలిపారు. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌లో మహిళా రైతులు సత్తమ్మ, విజయలక్ష్మిల మూడెకరాల పొలంలో ఆయిల్‌పామ్ మొక్కలను నాటారు. ఈ వార్షిక సంవత్సరానికి మండలవ్యాప్తంగా 30 మంది రైతులు పంటసాగుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఏమైనా సందేహాలు తలెత్తితే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు.
-
నల్ల పోచమ్మకు ప్రత్యేక పూజలు
మెదక్: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వెలిసిన శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో శ్రావణ మాస మంగళవారం పురస్కరించుకొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని, ఓడిబియ్యం సర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.
-
నిండుకుండలా పాలేరు జలాశయం..
ఖమ్మం: కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 23 అడుగులకు చేరింది. సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అధికారులు గేట్లు ఓపెన్ చేయడంతో అలుగు పారుతుంది. నాగార్జునసాగర్ నుంచి పాలేరు జలాశయానికి నీటి విడుదల కొనసాగుతోంది. దిగవ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
-
ఇంట్లో జారిపడి వృద్ధురాలి మృతి
మంచిర్యాల: ఓ వృద్ధురాలు ఇంట్లో జారి మృతి చెందిన ఘటన సోమవారం జిల్లా కేంద్రంలోని వెలుగుచూసింది. హమాలివాడ సూర్యనగర్‌కు చెందిన క్యాతం లక్ష్మి (74) అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలో సోమవారం ఆమె ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
-
బైక్.. కారు ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు
ములుగు: బైక్, కారు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన వాజేడు మండలం ప్రగల్లపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వాజేడు మండలం ప్రగల్లపల్లి గ్రామ సమీపంలో ఓ బైక్- కార్ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే క్షతగాత్రులను వెంకటాపురం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని ములుగు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు.