మెదక్: నర్సాపూర్ పోలీసులు మంగళవారం పలువురు బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు చంద్రయ్య, బీజేవైఎం అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ యాదవ్, సంఘసాని రాజు, వంశీ గౌడ్ సహా పలువురు నాయకులు అ ఉన్నారు. హైదరాబాద్‌లోని పెద్దమ్మ ఆలయాన్ని తరలించడంపై నిరసనగా గాంధీభవన్ ముట్టడికి బీజేపీ, బీజేవైఎం, హిందూ వాహిని పిలుపునిచ్చిన నేపథ్యంలో వారిని ముందస్తు అరెస్ట్ చేశారు.
Author: Shivaganesh
-
43 కేజీల గంజాయి సీజ్.. విలువ ఎంతంటే..!
ఖమ్మం: సుమారు రూ.22 లక్షల విలువైన 43 కేజీల గంజాయిని సోమవారం ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న 43 కేజీల గంజాయిని భద్రాచలం ఇసుక స్టాండ్ వద్ద వాహన తనిఖీలలో పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న రాజస్థాన్‌కు చెందిన సురేందర్ సింగ్‌ను అరెస్టు చేసి, కారును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
-
కలెక్టర్‌కు రాఖీ కట్టిన దివ్యాంగురాలు..
మెదక్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజవాణి సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించకూడదని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 66 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదు అందజేసిన అనంతరం ఓ దివ్యాంగురాలు కలెక్టర్‌కు రాఖీ కట్టాలనుకుంటున్నట్లు చెప్పగా కలెక్టర్ వెంటనే కుర్చీలోంచి లేచి వచ్చి రాఖీ కట్టించుకున్నారు.
-
‘పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కృషి చేయాలి’
సిద్దిపేట: అక్కన్నపేట మండలం చౌటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు… ప్రస్తుతం పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు షూ, టై, బెల్టులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంఈఓ రంగా హాజరై విద్యార్థులకు షూ, టై, బెల్టులు అందజేశారు. అనంతరం దాతలు గాదర్ల గణేష్, చుంచు పరంధాములు, అమిరిశెట్టి రమేష్‌లను అభినందించారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కృషి చేయాలని కోరారు.
-
భవిత కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
మెదక్: మెదక్‌లోని భవిత కేంద్రాన్ని సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్‌తో కలిసి కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగుల పిల్లల సామర్థ్యాలను పెంచేందుకు భవిత కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రూ.14 లక్షల వ్యయంతో కేంద్రంలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎఫ్.ఎల్.ఎన్. కార్యచరణ ప్రణాళిక టేబుల్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
-
‘దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి’
మెదక్: పాపన్నపేట తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఈసందర్భంగ ఆయన భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని అన్నారు. అనంతరం ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను పరిశీలించి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
రైలు కిందపడి యువకుడి మృతి.. ఎక్కడంటే
ఆదిలాబాద్: రైలు కిందపడి యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం తాంసీ మండలంలోని పోన్నారి శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. పొన్నారి శివారులో ఉదయం గూడ్స్ రైలు కిందపడి యువకుడు మరణించాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. మృతుడు గ్రామానికి చెందిన గుమ్ముల నరేష్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
డివైడర్‌ను ఢీకొన్న కంటైనర్..
ఖమ్మం: ఓకంటైనర్ లారీ డివైడర్‌ను ఢీకొన్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. చైతన్యనగర్ టేకులపల్లి బ్రిడ్జి వద్ద వైరా వైపు నుంచి ఖమ్మం వస్తున్న కంటైనర్ లారీ డివైడర్‌ను ఢీకొనింది. ప్రమాదంలో ఎవరికీఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిద్ర మత్తులోనె ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రహదారిని క్లియర్ చేశారు.
-
ఛోటా న్యూస్ కథనానికి స్పందించిన ‘కలెక్టర్’
ఆదిలాబాద్: ఛోటా న్యూస్‌లో ‘మురికి కాల్వ సమస్యను పరిష్కరించాలి’ అని వచ్చిన కథనానికి కలెక్టర్ రాజర్షి షా స్పందించారు. జిల్లా కేంద్రంలోని ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ కాలనీలో మురికి కాల్వపైన పైపు వేయించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించారు. ఈసందర్భంగా సంఘం అధ్యక్షుడు ఎండీ ఇమ్రాన్ కలెక్టర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు సంఘం సభ్యులు పాల్గొన్నారు.
-
భారీ వర్షం.. ఇండ్లలోకి వరద నీరు
వరంగల్: జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా హన్మకొండలోని భవానినగర్, చైతన్యపురి కాలనీ, అశోక్ నగర్, స్నేహానగర్, వరంగల్ సాకారశికుంట, ఏకశిలానగర్, శివనగర్ ఏరియాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లోని ఇండ్లలోకి వరదనీరు చేరి ఇంట్లోని వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. అత్యవరసం ఉంటేనే ప్రజలు రోడ్లపైకి రావాలని అధికారులు సూచిస్తున్నారు.